Begin typing your search above and press return to search.

మెహబూబూ మురిపిస్తోంది

By:  Tupaki Desk   |   24 April 2018 10:11 AM IST
మెహబూబూ మురిపిస్తోంది
X
కొత్త హీరోయిన్లు ఎంతమంది వచ్చినా వెల్ కం చెప్పడం టాలీవుడ్ కు అలవాటే. యాక్షన్ పెద్దగా రాకపోయినా ఒడ్డూ పొడవు బావుండి.. కాస్తంత గ్లామరస్ గా కనిపిస్తే చాలు బాగానే ఆఫర్లు దక్కించుకోవచ్చు. అందుకే అన్ని భాషల భామలు టాలీవుడ్ వైపు చూస్తుంటారు. తాజాగా కొత్తగా వెండితెరకు పరిచయం అవుతున్న ఓ కొత్త భామపై టాలీవుడ్ ఫోకస్ పడింది. ఆమే మెహబూబా హీరోయిన్ నేహాశెట్టి.

డైరెక్టర్ పూరి జగన్నాథ్ తన కొడుకు ఆకాష్ పూరిని హీరోగా పెట్టి తీస్తున్న చిత్రం మెహబూబా. బోర్డర్ బేస్ గా నడిచే ఈ ప్రేమకథా చిత్రం ట్రయిలర్ అందరినీ బాగా ఆకట్టుకుంది. అందునా ఇంకాస్త ఆకట్టుకుంది నేహాశెట్టి. మంచి పర్సనాలిటీ.. ఆకట్టుకునే ఫిజిక్.. గ్లామరస్ లుక్ ఉండటంతో ఆమెను పలువురు డైరెక్టర్లు హీరోయిన్ గా తీసుకునే ప్రయత్నాల్లో పడ్డారు. కానీ వాళ్లెవరూ డైరెక్ట్ గా అప్రోచ్ అవుదామంటే కుదరదు. ఎందుకుంటే ఈ భామకు పూరి కనెక్ట్స్ తో మూడేళ్ల కాంట్రాక్టు ఉంది. ఈ ప్రకారం ఈమె కొత్త సినిమా ఏం చేయాలన్నా పూరి జగన్నాథ్ కు చెందిన ఈ సంస్థ ద్వారానే చేయాలి.

పూరి జగన్నాథ్ సినిమాలతో హీరోయిన్లుగా అడుగుపెట్టిన రక్షిత.. అనుష్క లాంటివాళ్లు టాప్ లీగ్ లోకి వెళ్లారు. లోఫర్ తో పరిచయమైన దిశాపఠానీ ఇప్పుడు బాలీవుడ్ లో మెరుపులు మెరిపిస్తోంది. ఇప్పుడు నేహాశెట్టి తనకు ఈ రేంజ్ లోనే లక్ కలిసొస్తుందని ఆశిస్తోంది. మెహబూబూ వచ్చాక ఆమె టాలెంట్ ఏంటో తెలిసిపోతుందిగా. వెయిట్ అండ్ సీ