Begin typing your search above and press return to search.

వీడియో: నేహ సిస్టర్స్ బర్త్ డే కిస్సులు!

By:  Tupaki Desk   |   25 Jan 2020 10:24 AM GMT
వీడియో: నేహ సిస్టర్స్ బర్త్ డే కిస్సులు!
X
'చిరుత' ఫేమ్ నేహ శర్మ సోషల్ మీడియాలో చాలా ఫేమస్. సినిమాల ద్వారా నేహ ఎంత పాపులర్ అయిందో తెలీదు కానీ ఇన్స్టాగ్రామ్ హాటు ఫోటోలతో భారీ గుర్తింపు సాధించింది. ఈ నేహకో చెల్లి ఉంది. ఆ భామ కూడా హాటే. అక్క బాటలో గ్లామర్ సామ్రాజ్యంలో నడుస్తూ తనకంటూ కొంత గుర్తింపు సాధించింది. బికినీలతో నెటిజన్ల హృదయాలను ఫసాక్ చెయ్యడం ఈ భామకు కూడా అలవాటే.

ఈరోజు ఈ చెల్లి పుట్టినరోజు. దీంతో అక్క నేహ మహా ఆనందంలో ఉంది. తన ముద్దుల చెల్లి కి ప్రేమ తో ఓ ముద్దిచ్చింది. ఆ వీడియోను తన ఇన్స్టా ఖాతా ద్వారా షేర్ చేస్తూ ఒక పెద్ద మెసేజ్ పెట్టింది. "ఓ చెల్లి.. జన్మదిన శుభాకాంక్షలు. నేను కాఫీని ఎంత ప్రేమిస్తానో నిన్ను కూడా అంతే ప్రేమిస్తాను. నీతో జరిగిన ఎన్నో సంఘటనలు గుర్తు తెచ్చుకుంటూ సిస్టర్స్ మ్యాజిక్ ఇలా ఉంటుందని అనుకుంటూ ఉంటాను. వంటచేస్తున్నావంటే చాలు దాన్ని మాడుస్తావు. నువ్వు ఊరికి వెళ్తావు.. నీరు లేక నీ మొక్కలు చస్తాయి. అయినా నువ్వు ఎలా ఉంటావో అలానే ఉండు. నవ్వు ఒక క్రేజీ మనిషివని.. వైల్డ్ అని నాకు తెలుసు. నేను చేసే ప్రతి పనిలో నువ్వు నాకు భాగస్వామివి. నువ్వు కోరుకున్నవి అన్నీ నీకు దక్కాలని.. ఎప్పటికి నువ్వు సంతోషంగా ఉండాలని కోరుకుంటున్నాను" అంటూ అక్కగా తన ప్రేమను చెల్లిపై కురిపించింది.

ఇక వీడియో విషయానికి వస్తే ఐష అలా నిలుచుని ఉంటే పక్క నుంచి వచ్చి చెల్లి బుగ్గ మీద ముద్దిస్తుంది. మరి చెల్లి ఊరుకుంటుందా.. వెంటనే అక్కకు ఆ ముద్దు బాకీని తీర్చేస్తుంది. ఇద్దరూ కౌగలించుకుని నాలుకలు బయట పెట్టి ఓ నాటీ ఎక్స్ ప్రెషన్ ఇచ్చారు. ఈ వీడియో కు నెటిజన్ల నుండి భలే స్పందన దక్కింది. ఎంతో మంది నెటిజన్లు ఐష కు బర్త్ డే విషెస్ కూడా చెప్పారు.