Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరీ: 'చిరుత' చూపుల చిన్నది సంపేసేలా ఉందే

By:  Tupaki Desk   |   21 May 2020 5:45 AM GMT
ఫోటో స్టోరీ: చిరుత చూపుల చిన్నది సంపేసేలా ఉందే
X
చిరుత చిత్రంతో తెలుగు ప్రేక్షకులకు పరిచయం అయిన ముద్దుగుమ్మ నేహా శర్మ. ఆ సినిమాలో చరణ్‌ కు సరిజోడీగా నటించి మెప్పించిన ముద్దుగుమ్మ చరణ్‌ మొదటి హీరోయిన్‌ గా నిలిచి పోయింది. చిరుత తర్వాత తెలుగులో కుర్రాడు అనే చిత్రంలో నటించిన ఈ అమ్మడు ఆ చిత్రం సక్సెస్‌ కాకపోవడంతో కనుమరుగయ్యింది. తెలుగులో కనిపించకుండా పోయిన ఈ అమ్మడు హిందీలో వరుసగా చిత్రాలు చేస్తూ వస్తోంది. ప్రస్తుతం బాలీవుడ్‌ లో క్రేజీ హీరోయిన్‌ గా దూసుకు పోతుంది.

సోషల్‌ మీడియాలో ఈ అమ్మడు పోస్ట్‌ చేసే ఫొటోలు మరియు వీడియోలు ఆమె ఫాలోవర్స్‌ కు వింధు భోజనం అని చెప్పడంలో సందేహం లేదు. తాజాగా మరోసారి బ్లాక్‌ డ్రస్‌ లో చాలా ఘాటైన చూపులతో ఈ అమ్మడు కెమెరాకు ఫోజ్‌ ఇచ్చి కనిపించని కనిపించే అందాలను ప్రదర్శిస్తూ తన ఫాలోవర్స్‌ ను మరోసారి మతి పోగొట్టింది. ఆ చూపుల్లో మత్తు మందు ఉంది అన్నట్లుగా నేహాశర్మ చూపులు ఉన్నాయంటూ నెటిజన్స్‌ కామెంట్స్‌ చేస్తున్నారు.

ఈ ఏడాది మూడు సినిమాలతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యింది. అయితే ఈ విపత్తు సమయంలో ఆ సినిమాలు విడుదల అయ్యేనా లేదో తెలియాల్సి ఉంది. ఈ ఏడాది కాకున్నా వచ్చే ఏడాది అయినా సినిమాలు ప్రేక్షకుల ముందుకు రాబోతున్నాయి. ప్రస్తుతం చేసిన చేస్తున్న సినిమాలతో హిందీలో మళ్లీ బిజీ అవుతాననే నమ్మకంతో ఈ అమ్మడు ఉంది.