Begin typing your search above and press return to search.

ఫోటో స్టొరీ: హాట్ సిస్టర్స్ ఫోమ్ రోలింగ్

By:  Tupaki Desk   |   6 Sept 2018 12:41 PM IST
ఫోటో స్టొరీ: హాట్ సిస్టర్స్ ఫోమ్ రోలింగ్
X
కసరత్తులు ఎన్నో రకాలు. జిమ్ముకెళ్ళి వెయిట్స్ లిఫ్ట్ చేయడం ఒక్కటే కాదు ఎక్సర్ సైజ్ అంటే.. ఏరోబిక్స్ నుండి జుంబా డ్యాన్స్ లాంటివి ఎన్నో ఉన్నాయి. ఇలాంటివాటిలో చాలా టెక్నిక్స్ కూడా ఉంటాయి. అందులో ఫోమ్ రోలింగ్ ఒకటి. పైన ఫోటోలో ఐష శర్మ ఎడమ చేతి ని ఆనించింది చూడండి.. దాన్నే ఫోమ్ రోలర్ అంటారు. ఇక దాంతో ఎలా కసరత్తులు చేయాలో యూట్యూ లో బోలెడన్ని వీడియోలు ఉన్నాయి. చూసి వీలయితే మీరు కసరత్తులు చేయండి. ఫిట్ గా ఉండండి.

ఇక ఈ ఐష శర్మ ఎవరు అంటే నేహా శర్మ చెల్లి. మరి నేహా శర్మ ఎవరు అంటే చరణ్ డెబ్యూ ఫిలిం 'చిరుత' లో హీరోయిన్. ఈమె ఇన్స్టాగ్రామ్ లో చాలా పాపులర్. ఐదు మిలియన్లకు పైగా ఫాలోయర్లు ఉన్నారు. శర్మ సిస్టర్స్ ఇద్దరు కూడా ఫిట్నెస్ అంటే చెవి కోసుకునే బాపతు లానే ఉన్నారు. అందుకే ఈ కసరత్తులు చేసి కత్తి లాంటి లుక్స్ కోసం ప్రయత్నాలు చేస్తున్నారు.. ఇద్దరూ కలిసి ఇన్స్టాగ్రామ్ పేరుప్రతిష్టలను కాపాడుతున్నారు.

ఇద్దరు కలిసి ఉన్న ఒక హాట్ ఫోటోను పోస్ట్ చేయడమే కాకుండా ఫోమ్ రోలర్ వాడడం వలన వచ్చే ఉపయోగాలు కూడా వివరిస్తూ ఒక పెద్ద పోస్ట్ పెట్టారు. దీంతో ఎక్సర్ సైజ్ చేయడం వాళ్ళ ఫ్లెక్సిబిలిటీ పెరుగుతుందని.. బ్లడ్ సర్క్యులేషన్ మెరుగవుతుందని.. ఎక్సర్ సైజ్ వల వచ్చే మజిల్ స్ట్రెస్ తగ్గుతుందని తెలిపారు. వాళ్ళు చెప్పని పాయింట్ ఒకటే.. ఇవన్నీ చేసే వచ్చే ఒంపుసొంపులను హాట్ ఫోటోల రూపంలో సోషల్ మీడియాలో ధారపోస్తే నెటిజనులకు నిద్ర ఎగిరిపోతుందని..!