Begin typing your search above and press return to search.

ఫోటో స్టోరి: చిరుత పిల్లకు సాయం కావాలి

By:  Tupaki Desk   |   25 Aug 2017 5:50 PM IST
ఫోటో స్టోరి: చిరుత పిల్లకు సాయం కావాలి
X
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ తేజ్ హీరోగా అరంగేట్రం చేసిన మూవీ చిరుత. అదే సినిమాతో అడుగుపెట్టిన బ్యూటీ నేహా శర్మ. ఆ తర్వాత ఒకట్రెండు తెలుగు సినిమాల్లో నటించింది కానీ.. సెలక్షన్ లో చేసిన పొరపాట్ల కారణంగా ఇక్కడ కెరీర్ కి ఫుల్ స్టాప్ పడిపోయింది. ఆ తర్వాత బాలీవుడ్ లో తేలిపోయిన ఈ బ్యూటీ.. అడపాదడపా అయినా సినిమాలను చేస్తూనే ఉంది.

ఈ మధ్య సినిమాల కంటే ఫోటోషూట్స్ తో ఎక్కువగా హంగామా చేసేస్తోంది నేహాశర్మ. సెక్సీ లుక్స్ లో జనాలను కవ్వించడంలో బాగానే ఆరితేరిపోయింది. సహజంగా ఇలాంటి హాట్ షూట్స్ కు రకరకాల క్యాచీ నేమ్స్ ను ఆయా భామలే తగిలించేస్తుంటారు. కానీ రీసెంట్ గా ఈ అందాల భామ.. తన పరువాలను వీలైనంతగా ప్రదర్శిస్తూ తీసుకున్న ఓ ఫోటో విషయంలో మాత్రం కన్ఫ్యూజన్ వచ్చేసిందట. క్లీవేజ్ అందాలు ప్రస్ఫుటంగా కనిపించేలా తీసుకున్న ఈ సెల్ఫీకి ఎలాంటి క్యాప్షన్ కావాలో మాత్రం అమ్మడికి తెలియలేదట.

అందుకే ఏమైనా సలహాలు ఇస్తారా అని అడుగుతోంది నేహాశర్మ. అందగత్తె సాయం అడిగితే కాదనే వాళ్లు ఎవరైనా ఉంటారా చెప్పండి.. వేలు.. లక్షల కొద్దీ సజెషన్స్ వచ్చేస్తాయి కదా. అది సరే కానీ.. ఇంతలేసి అందాలు అక్కడ కనిపిస్తుంటే.. అసలు క్యాప్షన్ గురించి వెతికే వాళ్లు ఎంతమంది ఉంటారన్నదే అసలు సిసలైన పాయింట్. కళ్లు చెదిరే అందాలను వదిలేసి.. కామెంట్స్ ను చదువుకుంటూ కూర్చునే వాళ్లను ఏమనాలో కదా!