Begin typing your search above and press return to search.

చిరుతపిల్లకు టాలీవుడ్ బాకీ ఉందండీ

By:  Tupaki Desk   |   11 Sept 2016 3:30 PM
చిరుతపిల్లకు టాలీవుడ్ బాకీ ఉందండీ
X
మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ అరంగేట్ర మూవీ చిరుతలో ఇరగదీసిన హీరోయిన్ నేహాశర్మ. ఏ యాంగిల్ లో చూసినా సరే ఆడియన్స్ ను తెగ రెచ్చకొట్టేసిన ఈ బ్యూటీ ఆ తర్వాత తెలుగులో మరో సినిమా చేసిందంతే. కుర్రాడు అంటూ వరుణ్ సందేశ్ మూవీలో కనిపించింది. ఆ తర్వాత తెలుగులో మరో ఛాన్స్ రాలేదు. టాలీవుడ్ నుంచి మరో ఆఫర్ కూడా అందలేదు.

అయితే.. హిందీలో మాత్రం వరుసగా సినిమాలు చేస్తూనే ఉంది. రీసెంట్ గా ఎఫ్ హెచ్ ఎం మేగజైన్ లో మాంచి ఫోటో షూట్ ఒకటి చేసింది. చూసేందుకే పెయింటింగ్ లాంటి బాడీ స్ట్రక్చర్ ఉండే ఈ చిరుత పిల్ల.. కాన్వాస్ పై పెయింటింగ్ వేసీ వేసీ బాగా అలిసిపోయి.. ఆలోచనలో మునిగిపోయినట్లుగా ఇలా పోజ్ ఇచ్చేసింది. మళ్లీ తను పెయింటింగ్ వేయలేదని అనుకుంటామేమో అని.. తన బాడీపై అక్కడక్కడా పెయింట్ మరకలు కూడా సింగారించేసుకుంది.

ఏమైనా 2007లో చిరుత విడుదలైతే.. అప్పటి నుంచి దాదాపు 10 ఏళ్లు పూర్తయిపోయినా.. ఇంకా అదే ఫిజిక్ తో మెరిసిపోతుండడం మాత్రం బాగా పట్టించుకోవాల్సిన విషయం. చిరుత పిల్ల అందాన్ని సోయగాలను చూస్తుంటే.. టాలీవుడ్ ఈమెకు ఇంకో అవకాశం బాకీ పడిపోయిందనడంలో డౌట్స్ ఏం అవసరం లేదు.