Begin typing your search above and press return to search.

లాక్ డౌన్ టైంలో నీకు రోడ్ల మీద పనేంటి నేహా..!

By:  Tupaki Desk   |   8 April 2020 12:10 PM GMT
లాక్ డౌన్ టైంలో నీకు రోడ్ల మీద పనేంటి నేహా..!
X
మెగా పవర్‌ స్టార్‌ రామ్‌ చరణ్‌ హీరోగా పరిచయం అయిన చిరుత సినిమాతో వెండితెరకు పరిచయం అయిన హాట్ బ్యూటీ నేహా శర్మ. తొలి సినిమాలోనే అందాలతో ఆకట్టుకున్న ఈ భామ ఆశించిన స్థాయిలో ఆకట్టుకోలేకపోయింది. సక్సెస్‌ లు దక్కినా వరుస ఆఫర్లు మాత్రం సాధించలేకపోయింది. ఆ తర్వాత వరుణ్ సందేశ్ సరసన ‘కుర్రాడు’ సినిమాలో కనిపించింది. కానీ టాలీవుడ్‌ లో పెద్దగా అవకాశాలు రాలేదు. దీంతో ఈ బ్యూటీ తరువాత బాలీవుడ్ చెక్కేసి అక్కడే సెటిల్ అయిపోయింది. 'క్రూక్' అనే సినిమాతో బాలీవుడ్ లో అడుగు పెట్టిన నేహశర్మ తేరి మేరీ కహానీ - యంగిస్థాన్ - ముబారకన్ చిత్రాల ద్వారా మంచి గుర్తింపు పొందింది. భారీగా అవకాశాలు లేకపోయినా బాలీవుడ్‌ లో అడపదడపా సినిమాలు చేస్తూ అలరిస్తోంది. తాజాగా మాలీవుడ్ కోలీవుడ్ లలో కూడా అవకాశాలు అందుకుంటోంది నేహాశర్మ. 2017లో రిలీజ్‌ అయిన మలయాళ సినిమా 'సోలో'లో ఓ కీలక పాత్రలో నటించింది నేహా. దుల్కర్‌ సల్మాన్‌ హీరోగా తెరకెక్కిన ఈ సినిమాకు బిజో నంబియార్ దర్శకుడు. రెండేళ్ల తరువాత మరోసారి అదే దర్శకుడితో సినిమా చేస్తోంది నేహా శర్మ. బిజో నంబియార్‌ బాలీవుడ్‌ లో స్వయంగా నిర్మిస్తూ డైరెక్ట్‌ చేస్తున్న 'తైష్‌' సినిమాలో నటిస్తోంది. ఈ సినిమాలో పులకిత్‌ సామ్రాట్‌ - కృతి కర్బందా - జిమ్‌ శర్బ్‌ - హర్షవర్థన్‌ రానేలు ఇతర కీలక పాత్రల్లో నటిస్తున్నారు. రీసెంటుగా అజయ్ దేవగన్ హీరోగా నటించిన 'తానాజీ' సినిమాలో కూడా మెరిసింది ఈ బ్యూటీ.

అయితే సినిమా సంగతి పక్కన పెడితే సోషల్ మీడియాలో నేహా శర్మ క్రేజ్ మామూలుగా లేదు. ఎప్పుటికప్పుడు హాట్ హాట్‌ ఫోటోలతో అభిమానులను అలరిస్తూ సోషల్‌ మీడియాను హీటెక్కిస్తుంది ఆ బ్యూటీ. కరోనా లాక్ డౌన్ నేపథ్యంలో ఇంటికే పరిమితమైన నేహా హాట్‌ ఫోటోలతో అభిమానులను పలకరిస్తూ ఉంది. ఈ ఫొటోల్లో నేహా లుక్స్‌ సూపర్బ్ అంటున్నారు ఫ్యాన్స్‌. తన సిస్టర్ తో కలిసి వర్క్ అవుట్ వీడియోలను ఎప్పటికప్పుడు సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తూ కుర్రకారు మతులు పోగొడుతూ ఉంటుంది. ఇప్పుడు తాజాగా బ్లూ టాప్ ధరించి ఎద సొంపులను బయటకి కనిపించేలా ఉన్న ఫోటో ఒకటి సోషల్ మీడియాలో పోస్ట్ చేసింది. ఈ ఫొటోకు ఫిదా అయిన కుర్రకారు వైరల్ చేయడం స్టార్ట్ చేసారు. అయితే ఈ ఫోటో చూసిన కొంతమంది నేహా శర్మ ఓపెన్ ప్లేస్ లో ఫోజ్ ఇచ్చినట్లు గుర్తించి కామెంట్స్ చేయడం స్టార్ట్ చేసారు. లాక్ డౌన్ టైములో నీకు రోడ్ల మీద ఏం పని పాప అంటూ ప్రశ్నిస్తున్నారు నెటిజన్లు. అక్కడితో ఆగకుండా 'స్టే హోమ్ స్టే సేఫ్' అంటూ జాగ్రత్తలు చెప్తున్నారు. కొంతమంది మాత్రం అవి ఓల్డ్ పిక్స్ అయి ఉంటాయి.. నేహాకు మాత్రం తెలియదా కరోనా డేస్ లో కేర్ ఫుల్ గా ఉండాలని అంటూ ఆమెని వెనకేసుకొస్తున్నారు.