Begin typing your search above and press return to search.

ఫొటోటాక్ : చిరుత బ్యూటీ ఇంకా ఫామ్‌ లోనే ఉందే

By:  Tupaki Desk   |   27 Jan 2022 5:01 AM GMT
ఫొటోటాక్ : చిరుత బ్యూటీ ఇంకా ఫామ్‌ లోనే ఉందే
X
మెగా పవర్ స్టార్‌ రామ్‌ చరణ్‌ మొదటి సినిమా చిరుత లో నటించిన ముద్దుగుమ్మ నేహా శర్మ. ఈ అమ్మడు చిరుత సినిమా తో మంచి గుర్తింపు దక్కించుకుంది. కాని అదృష్టం కలిసి రాలేదు. దాంతో ఈ అమ్మడికి అవకాశాలు చాలా తక్కువ వచ్చాయి. తెలుగు లో ఈ అమ్మడు హీరోయిన్‌ నటించిన సినిమాలు కొన్ని సక్సెస్ అయినా కూడా టాలీవుడ్‌ లో స్టార్‌ డమ్ ను ఈ అమ్మడు దక్కించుకోవడంలో విఫలం అయ్యింది. హీరోయిన్ గా ఈ అమ్మడు నటించిన సినిమాలు బాక్సాఫీస్ వద్ద బొక్క బోర్లా పడటంతో ఇప్పుడు బాలీవుడ్ లో సినిమాలను ట్రై చేస్తోంది. బాలీవుడ్‌ లో అడపా దడపా సినిమాలు చేస్తూ అక్కడ బిజీగానే ఉన్న ఈ అమ్మడు సోషల్‌ మీడియాలో సందడి చేస్తూ వస్తోంది.

సోషల్ మీడియాలో ఈ అమ్మడి అందాల ప్రదర్శణ కంటిన్యూ అవుతోంది. రెగ్యులర్ గా కొత్త హీరోయిన్స్ కు ఏమాత్రం తగ్గకుంగా అందాల వింధు చేస్తూనే ఉంది. హీరోయిన్‌ గా అవకాశాలు ఈ అమ్మడికి వచ్చినా రాకున్నా కూడా హాట్ ఫొటో షూట్స్ తో రెట్టింపు గుర్తింపు అయితే లభిస్తుంది అంటూ నెటిజన్స్‌ కామెంట్స్ చేస్తున్నారు. ఈ అమ్మడు చిరుత సినిమాతో ఇండస్ట్రీలో అడుగు పెట్టి చాలా సంవత్సరాలు అయ్యింది. అయినా ఇంకా కూడా అందాల వింధు విషయంలో ఏమాత్రం వెనక్కు తగ్గడం లేదు.

బాలీవుడ్‌ తో పాటు ఇతర భాషల్లో కూడా సినిమా ఆఫర్లు దక్కించుకుంటూ మళ్లీ తెలుగు లో రీ ఎంట్రీ ఇచ్చేందుకు ఈ అమ్మడు ప్రయత్నాలు చేస్తుంది. ఈ అమ్మడికి ఇప్పటికి కూడా సౌత్ లో ముఖ్యంగా తెలుగు ప్రేక్షకుల్లో అభిమానులు ఉన్నారు. చిరుత లో ఈ అమ్మడి నటనకు మరియు బాడీ లాంగ్వేజ్ కు మరియు పొగరుకు ఎంతో మంది అభిమానులు ఉన్నారు. ఇప్పుడు ఫొటో లు షేర్ చేసినా కూడా నేహా శర్మ ను అభిమానించే వారు చాలా మంది ఉంటారు అనడంలో సందేహం లేదు. నేహా శర్మ అందాల విందు ఇంకా కొనసాగుతూనే ఉంది.