Begin typing your search above and press return to search.

సమ్మర్ లో వేస్తే.. ఇప్పుడు పాపులరైంది

By:  Tupaki Desk   |   10 July 2016 4:26 AM GMT
సమ్మర్ లో వేస్తే.. ఇప్పుడు పాపులరైంది
X
మన మీడియా వాళ్ళున్నారే.. ఎప్పుడో వచ్చిన న్యూస్ ను కూడా ఇప్పుడు హైలైట్‌ చేస్తుంటారు. దానితో ఏ న్యూస్ ఎందుకు హైలైట్ అవుతుందో కూడా తెలియని పరిస్థితి ఏర్పడుతోంది. సడన్ గా ఇప్పుడు తెలుగులో సింగర్ నేహా బాసిన్ బికినీ పిక్చర్ ఒకటి వైరల్ అయిపోయింది. దానితో ఆమెకు కాల్స్ మీద కాల్స్ వస్తున్నాయట. అసలు నాలుగు నెలల క్రిందటి ఫోటో ఇప్పుడు వైరల్ అవ్వడమేంటని ఆమె షాకవుతోంది.

దేవిశ్రీప్రసాద్‌ స్వర కల్పనలో.. నువ్వె నువ్వె కావాలి (ఊసరవెల్లి).. ఆవ్‌ తుజో మోఘ్ కోర్తా (1 నేనొక్కడినే) వంటి పాటలు పాడింది నేహా బాసిన్. పాప్ సింగర్ గా అమ్మడు బాలీవుడ్‌ లో బాగానే ఫేమస్. అలాగే జెన్నిఫర్‌ లోపెజ్.. బ్రిట్నీ స్పియర్స్ వంటి సింగర్ల టైపులో వస్ర్తదారణ కూడా చాలా హాటుగా ఉంటుంది. ఆ మధ్య సమ్మర్ లో గోవా మరియు కేరళ ఫ్యామిలీ ట్రిప్‌ వెళ్లింది అమ్మడు. అక్కడ తన అక్కయ్య రాశి బాసిన్‌ తో కలసి బికినీల్లో ఫోజులు ఇచ్చింది. హాటు హాటు బాడీ ఉన్నప్పుడు చూపించడానికి సిగ్గేల అంటూ రెచ్చిపోయింది.

అయితే నాలుగు నెలల తరువాత ఈ ఫోటోలు ఇక్కడ వైరల్ అయ్యాయ్‌. అదేంటి.. బికినీ ఫోటో సమ్మర్ లో పెడితే మీకు రెయినీ సీజన్ లో లైటెలిగిందా అంటూ ఆశ్చర్యపోయింది నేహా. ఇలాంటి ఫోటోలు టైమ్ లెస్ అని చెప్పుకోవాల్లే పాపయ్. ఎప్పుడూ చూసినా.. నీ పాటలా హాటుగానే ఉంటాయి.