Begin typing your search above and press return to search.

బికినీతో గుబులు పుట్టిస్తున్న సింగర్

By:  Tupaki Desk   |   9 July 2016 7:26 AM GMT
బికినీతో గుబులు పుట్టిస్తున్న సింగర్
X
మిగిలిన సింగర్స్ మాట ఎలా ఉన్నా.. దక్షిణాదికి చెందిన గాయనీమణులంతా పద్ధతిగా.. సంప్రదాయబద్ధంగా ఉంటారు. అయితే చీరలు.. లేదంటే చుడీదార్లతో సంప్రదాయానికి కేరాఫ్ అడ్రస్ అన్నట్లుగా ఉంటారే తప్పించి.. అందాల ఆరబోతకు ఆమడ దూరంలో ఉంటారు. ఇందుకు భిన్నంగా తాజాగా ఒక సింగర్ వ్యవహారం ఇప్పుడు హట్ టాపిక్ గా మారింది. తన స్వరంతో ఇప్పటికే తన వైపు తిప్పుకున్న ఈ భామ.. తన హాట్ అందాలతో కుర్రకారుకు ఆవిర్లు పుట్టేలా చేస్తోంది.

అందాల ప్రదర్శనలో తెగించేసినట్లుగా ఏకంగా బికినీలో దర్శనమిచ్చేయటం ఇప్పుడు అందరిని అవాక్కయ్యేలా చేస్తుంది. ఇంతకీ ఈ సింగర్ ఎవరంటారా? అక్కడికే వచ్చేస్తున్నాం టాలీవుడ్ అందగాడు మహేశ్ బాబు నటించిన ‘‘1’’ నేనక్కడినే సినిమాలో ఆవ్ తుజే మోహ్ కర్తా పాటతో దుమ్ము రేపిన సింగర్ నేహా బాసిన్.. తాజాగా తన బికినీ ఫోటో షూట్ తో మతి పోగొడుతోంది. మిగిలిన సింగర్స్ కు భిన్నంగా ట్రెండీగా రెఢీ అయి.. సోషల్ మీడియాలో కనువిందు చేసే నేహా.. తాజాగా బికినీలో కనిపించి.. తన అందాల్ని దాదాపుగా చూపించి.. చూసినోడికి చూసినంత అన్న చందంగా ఓపెన్ ఆఫర్ ఇచ్చేసింది. మరి.. అమ్మడి అందాల్ని మీరు కూడా ఓ లుక్కేయండి.