Begin typing your search above and press return to search.

క‌రోనా విజృంభ‌ణ‌కు నిర్ల‌క్ష్యం కార‌ణం కాదుః ర‌కుల్

By:  Tupaki Desk   |   26 April 2021 8:00 AM IST
క‌రోనా విజృంభ‌ణ‌కు నిర్ల‌క్ష్యం కార‌ణం కాదుః ర‌కుల్
X
క‌రోనా సెకండ్ వేవ్ విజృంభించ‌డంతో మ‌రోసారి అన్ని రంగాల‌పై ప్ర‌భావం ప‌డుతోంది. ఇప్ప‌టికే ప‌లు రాష్ట్రాల్లో మినీ లాక్ డౌన్ త‌ర‌హా ప‌రిస్థితులు నెల‌కొన్నాయి. ఢిల్లీ వంటి రాష్ట్రాల్లో పూర్తిగా లాక్ డౌన్ కొన‌సాగుతోంది. ఇటుతెలుగు రాష్ట్రాల్లో రాత్రిపూట క‌ర్ఫ్యూ కొన‌సాగుతోంది. బాలీవుడ్లో సినిమా షూటింగ్ లు ఎప్ప‌డో నిలిచిపోయాయి. టాలీవుడ్ లో కూడా ఒక్కొక్కొటిగా సినిమా షూటింగులు వాయిదా ప‌డుతున్నాయి.

ఈ నేప‌థ్యంలో త‌న అనుభ‌వాల‌ను చెప్పుకొచ్చింది హీరోయిన్ ర‌కుల్ ప్రీత్ సింగ్‌. గ‌తేడాది లాక్ డౌన్ లో సినిమా షూటింగులు ఆగిపోయిన‌ప్పుడు తాను చాలా బాధ‌ప‌డ్డాన‌ని వెల్ల‌డించింది. కానీ.. ఇప్పుడు అంత‌గా బాధ‌లేద‌ని చెప్పింది ర‌కుల్‌.

వ్యాపారాలు నిలిచిపోవ‌డం, ఉపాధి దూర‌మ‌వ‌డంతో చిరువ్యాపారులు, సాధార‌ణ జ‌నం చాలా ఇబ్బంది ప‌డుతున్నార‌ని చెప్పింది. వాళ్ల‌తో పోలిస్తే.. త‌న‌ది చాలా చిన్న స‌మ‌స్య అని తెలిపింది. ఇక‌, క‌రోనా ఈ స్థాయిలో విజృంభించ‌డానికి జ‌నాల నిర్ల‌క్ష్య‌మే కార‌ణ‌మంటే తాను ఒప్పుకోన‌ని చెబుతోంది.

త‌ల రాత బాగ‌లేక‌పోతే ఎవ్వ‌రూ ఏమీ చేయ‌లేర‌ని చెప్పింది. త‌న‌కు తెలిసిన‌వారు ఎంతో జాగ్ర‌త్త‌గా ఉన్నా.. రెండోసారి క‌రోనా వ‌చ్చింద‌ని ఆవేద‌న వ్య‌క్తంచేసింది. ఇక‌, గ‌తేడాది షూటింగులు మానేసి, ఇంట్లో కూర్చోవ‌డం చాలా ఇబ్బందిగా అనిపించింద‌న్న ర‌కుల్‌.. ఇప్పుడు పెద్ద‌గా ఇబ్బంది అనిపించ‌ట్లేద‌ని తెలిపింది.