Begin typing your search above and press return to search.

పూర్ణ‌కు నెగెటివ్ షేడ్ ఆఫ‌ర్లు ఖాయ‌మే!

By:  Tupaki Desk   |   7 March 2021 1:30 PM GMT
పూర్ణ‌కు నెగెటివ్ షేడ్ ఆఫ‌ర్లు ఖాయ‌మే!
X
అందానికి అందం చ‌క్క‌ని అభిన‌యంతో ఆక‌ట్టుకున్న న‌టి పూర్ణ‌. అల్ల‌రి ర‌విబాబు కాంపౌండ్ లో వ‌రుస సినిమాల్లో న‌టించింది ఈ బ్యూటీ. అవును- అవును 2లో న‌టించిన పూర్ణ ఆ త‌ర్వాత కూడా ర‌విబాబుతో క‌లిసి ప‌ని చేసింది. న‌రేష్ స‌ర‌స‌న సీమ ట‌పాకాయ్ చిత్రంలో న‌టించింది.

అయితే ఇటీవ‌ల కెరీర్ ప‌రంగా ఆశించిన అవ‌కాశాలు రాక‌పోవ‌డంతో బుల్లితెర జ‌డ్జిగానూ అవ‌కాశాలు అందుకుంటోంది. బుల్లితెర‌పై డ్యాన్స్ రియాలిటీ షోల్లో పూర్ణ జ‌డ్జిగా కొన‌సాగుతున్నారు. అయితే స‌డెన్ గా మ‌ళ్లీ ప‌వ‌ర్ ప్లే అనే చిత్రంలో పూర్ణ స‌ర్ ప్రైజ్ చేసారు.

ప‌వ‌ర్ ప్లే ఈ శుక్ర‌వార‌మే రిలీజైంది. ఎరాటిక్ థ్రిల్ల‌ర్ కాన్సెప్టుతో కొత్త‌గా ట్రై చేసింది టీమ్. కానీ విజువ‌లైజేష‌న్ ప‌రంగా కొన్ని త‌ప్పిదాలు విమ‌ర్శ‌కుల్ని మెప్పించ‌లేదు. ఇక‌పోతే ఈ సినిమాతో ఎవ‌రికి పేరు వ‌చ్చినా రాక‌పోయిన పూర్ణ‌కి మాత్రం కొత్త ఆఫ‌ర్స్ వ‌స్తున్నాయ‌ని తెలుస్తోంది. ఈ సినిమాలో పూర్ణ విల‌న్ గా న‌టించారు. నెగ‌టివ్ షేడ్స్ ఉన్న రోల్ చేయ‌డ‌మే కాదు.. కాస్త ఎరాటిక్ స‌న్నివేశాల్లో కూడా పూర్ణ అభిన‌యం ఆక‌ట్టుకుంది. దీంతో ఈ త‌ర‌హా క్యారెక్టర్స్ చేయ‌మ‌ని ఈ బొద్దుగుమ్మ‌ని అడుగుతున్నార‌ట. ఇప్ప‌టికే ఈ బ్యూటీ బాల‌య్య‌- బోయ‌పాటి సినిమాలో విల‌న్ గా న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఆ త‌ర్వాత నెగెటివ్ షేడ్ రోల్స్ లో ఆఫ‌ర్స్ త‌న‌ని వ‌రించ‌నున్నాయ‌ని తెలుస్తోంది.