Begin typing your search above and press return to search.
రానా నాయుడికి అది బాగా కలిసి వచ్చింది..!
By: Tupaki Desk | 17 March 2023 9:00 PM GMTఒక సినిమా బాగుంది అన్న దాని మీద ఎలాంటి సోషల్ డిస్కషన్ జరుగుతుందో అలానే మరో సినిమా బాగాలేదు అన్న దాని మీద సోషల్ మీడియా డిస్కషన్స్ జరుగుతుంటాయి. సినిమాల విషయంలో ఈ లెక్క అలా ఉంటే వెబ్ సీరీస్ లో ఈ సోషల్ డిస్కషన్స్ మాత్రం ఆ సీరీస్ లకు హెల్ప్ చేస్తాయని చెప్పొచ్చు. ముఖ్యంగా రీసెంట్ రిలీజ్ రానా నాయుడు వెబ్ సీరీస్ కి ఈ నెగిటివ్ పబ్లిసిటీ మాత్రం బాగా హెల్ప్ అయ్యింది. వెంకటేష్ రానా కలిసి చేసిన ఈ వెబ్ సీరీస్ ఎన్నో భారీ అంచనాలతో వచ్చింది.
అయితే ఈ సీరీస్ చూసిన వారంతా మొదట్లో బాబోయ్ క్లీన్ ఎంటర్టైనర్ అయిన వెంకీ మామతో ఇలాంటి బూతు సీరీస్ తీశారేంటి అని కామెంట్ చేశారు. వెంకటేష్ ఇమేజ్ ని దెబ్బ తీయడానికే ఈ సీరీస్ అంటూ ట్రోల్ చేశారు.
అందరూ రానా నాయుడు మీద నెగిటివ్ ఫీడ్ బ్యాక్ ఇస్తుంటే అసలు ఇందులో అంతగా ఏముంది అని చూడటం మొదలు పెట్టారు. ఫైనల్ గా మొదట్లో కామెంట్ చేసిన వారు సైలెంట్ అయితే రానా నాయుడు చూసి ఇప్పుడు వావ్ అనేస్తున్నారు.
రానా అయితే ఈ సీరీస్ ప్రమోషన్స్ ని భారీగా చేస్తున్నాడు. ఎలాగు దగ్గుబాటి హీరోలిద్దరు కలిసి చేశారు కాబట్టి ఈ వెబ్ సీరీస్ ప్రమోషన్స్ కోసం ఏకంగా రామానాయుడు స్టూడియో పేరుని సీరీస్ ప్రమోషన్ కోసం రానా నాయుడుగా మార్చేశారు.
ఇది కేవలం రానా, వెంకటేష్ సీరీస్ కాబట్టే అలా చేయగలిగారు. కొందరు ద్వేషించినా కొందరు ఇష్టపడినా రానా నాయుడు సీరీస్ ని ఓ రేంజ్ లో చూసేస్తున్నారు. నెట్ ఫ్లిక్స్ ట్రెండింగ్ లో టాప్ ప్లేస్ లో ఈ సీరీస్ ఉంది అంటే ఈ నెగటివ్ పబ్లిసిటీ ఏ రేంజ్ లో హెల్ప్ అయ్యిందో అర్ధం చేసుకోవచ్చు.
వెంకటేష్ ని ఇదివరకు ఎప్పుడూ చూడని విధంగా చూసిన ఆడియన్స్ ఆయన విషయంలో కొద్దిగా డిజప్పాయింట్ అయినా రానా మాత్రం ఈ సీరీస్ తో నెక్స్ట్ లెవెల్ కు వెళ్లాడని చెప్పొచ్చు. ఆల్రెడీ బాలీవుడ్ లో బాహుబలితో క్రేజ్ తెచ్చుకున్న రానా రానా నాయుడుతో అక్కడ ఇంకాస్త పాపులారిటీ తెచ్చుకున్నాడు.
నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.