Begin typing your search above and press return to search.
ప్రభాస్ లుక్స్ పై నార్త్ ఆడియన్స్ నెగిటివ్ కామెంట్స్..!
By: Tupaki Desk | 26 Aug 2021 4:00 PM ISTయంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ ప్రస్తుతం నాలుగు పాన్ ఇండియా ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్నారు. నాలుగు చిత్రాల్లోనూ వివిధ రకాల గెటప్స్ లో డార్లింగ్ కనిపించనున్నారు. ఈ క్రమంలో 'ఆదిపురుష్' షూటింగ్ కోసం ప్రస్తుతం ప్రభాస్ ముంబైలో ఉన్నాడు. అయితే డ్యాన్స్ రిహాసల్స్ కోసం స్టూడియోకి వెళ్తున్న ప్రభాస్ కెమెరాల కళ్ళకు చిక్కారు. ఈ ఫోటోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. ఇందులో మేకప్ లేకుండా ఉన్న ప్రభాస్ లుక్స్ చూసి అందరూ ఆశ్చర్యం వ్యక్తం చేశారు. ఇదే అదనుగా చేసుకున్న బాలీవుడ్ ఆడియన్స్ కొందరు పనిగట్టుకుని ప్రభాస్ లుక్స్ పై ఫిజిక్ పై నెగెటివ్ కామెంట్స్ చేస్తున్నారు.
ప్రభాస్ దాదాపు 50 ఏళ్ల మేనమామలా కనిపిస్తాడని.. మేకప్ లేకుండా అతన్ని చూడటానికి చాలా ఇబ్బందికరంగా ఉందని ఓ నెటిజన్ కామెంట్ చేసాడు. ప్రభాస్ అంకుల్ మాదిరిగా కనిపిస్తున్నారని ఒకడు కామెంట్ చేస్తే.. మిల్క్ మ్యాన్ లా ఉండాల్సిన వ్యక్తి ముసలివాడి లా అయ్యాడని మరొకడు ట్రోల్ చేసాడు. ఉత్తరాది ప్రేక్షకులు సౌత్ హీరోల లుక్స్ ఫిజిక్ ని ట్రోల్ చేయడం ఇదేమీ మొదటిసారి కాదు. గతంలో కూడా చాలాసార్లు ఇలా వ్యవహరించారు. అయితే వీరికి టాలీవుడ్ ఫ్యాన్స్ కూడా సోషల్ మీడియాలో ధీటుగా కౌంటర్ కామెంట్స్ తో సమాధానం చెబుతున్నారు.
'బాహుబలి' సినిమాతో బాలీవుడ్ మార్కెట్ పై ఆధిపత్యం చాలాయించిన ప్రభాస్ ని ఉత్తరాది ఆడియన్స్ చాలాసార్లు తక్కువ చేయాలని ట్రై చేశారు. అయితే ప్రభాస్ మాత్రం సినిమా సినిమాకి తన స్థాయిని పెంచుకుంటూ పాన్ ఇండియా స్టార్ గా మారిపోయారు. అయినా డార్లింగ్ ప్రస్తుతం నాలుగు ప్రాజెక్ట్స్ తో నిర్విరామంగా వర్క్ చేస్తున్నారు. ఒకేసారి రెండేసి సినిమాలతో రెస్ట్ లేకుండా ఉండటం వల్ల తన లుక్ కొంచెం మారి ఉండొచ్చు. అలాంటి ఒక ఫోటోని పట్టుకొని హీరోని డీ ఫేమ్ చేయడం తగదని.. ప్రభాస్ స్టామినా ఏంటో ఇండియన్ బాక్సాఫీస్ కు ఇప్పటికే చూపించారని.. ఇలాంటివి అతన్ని తక్కువ చేయలేవని డార్లింగ్ ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు.