Begin typing your search above and press return to search.

ట్రైలర్ టాక్: కొమా లోకెళ్ళాలంటే ప్రొసీజర్ ఏంటి?

By:  Tupaki Desk   |   22 Aug 2018 7:32 AM GMT
ట్రైలర్ టాక్: కొమా లోకెళ్ళాలంటే ప్రొసీజర్ ఏంటి?
X
ఆది పినిశెట్టి - తాప్సీ పన్ను - రితిక సింగ్ లీడ్ రోల్స్ లో నటించిన 'నీవెవరో' ఆగష్టు 24 న విడుదలకు సిద్ధమవుతోంది. ఈ సినిమా మొదటి ట్రైలర్ కాస్త సీరియస్ గా సాగింది. సినిమా జోనర్ మర్డర్ మిస్టరీ కావడంతో అందరూ ఇక సీరియస్ టోన్ లో సాగే సినిమా అనుకున్నారు. దీంతో ఫిలిం మేకర్స్ మరో ట్రైలర్ కు 'నీవెవరో హిలేరియస్ ట్రైలర్' అని పేరు పెట్టారు. వాళ్ళు చెప్పాల్సింది డైరెక్ట్ గా చెప్పారు. ఈ ట్రైలర్ ను మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కాసేపటి క్రితం రిలీజ్ చేసి 'నీవెవరో' టీమ్ కు అల్ ది బెస్ట్ చెప్పాడు.

ట్రైలర్ అంతా కామెడీ పంచులతో సందడి సాగింది.

'హాయ్ అను.. నాన్నగారు ఉంటే ఒకసారి రమ్మనవా.. ఓ పెగ్గేసి పోతారు' అనే డైలాగ్ కి కౌంటర్ గా రాజా రవీంద్ర 'పెగ్గేస్తే నిజంగానే పోతారు' అంటాడు.

'నా పేరు కళ్యాణ్ అండీ.. హైదరాబాద్ నుంచి వచ్చాను' అని ఆది అంటే.. 'పేరు చెప్పడానికి హైదరాబాద్ నుండి వచ్చావా' అంటూ వెన్నెల భయ్యా కౌంటర్.

మరో సీన్ లో వెన్నెల కిషోర్ ఆది తో 'నీకో విషయం తెలుసా.. ఈ వంకతో నేను ఇవాంకాను కూడా కలవొచ్చు' అంటాడు.

మరో సీన్ లో వెన్నెల కిషోర్ ఫోన్ లో మాట్లాడుతూ 'మా అమ్మ కోమాలో నుంచి బయటకు రాదు గానీ నేను కోమాలోకి వెళ్ళాలంటే ప్రొసీజర్ ఏంటి డాక్టర్' అంటాడు.

ఇక ఇలాంటివి చమత్కారాలు మరి కొన్ని ఉన్నాయి. జనగణమన జగదీష్ గా సప్తగిరి సీన్లు కూడా సూపర్.

'నీవెవరో' సినిమాకు పెద్దగా బజ్ లేదని వార్తలు వచ్చాయి దీంతో ఈ సినిమా నిర్మాత కమ్ రైటర్ అయిన కోన వెంకట్ దగ్గరుండి మరీ కసిగా ఈ ట్రైలర్ కట్ చేయించినట్టుగా ఉన్నాడు. కాసేపాగితే మన మీద కూడా పంచ్ పడుతుందేమో.. త్వరగా ట్రైలర్ చూసేయండి.