Begin typing your search above and press return to search.

RRR షూటింగుకి పిలిచాక ఆలియా పెళ్లి మూడ్ లో కెళ్లిందా?

By:  Tupaki Desk   |   12 Oct 2020 12:30 PM GMT
RRR షూటింగుకి పిలిచాక ఆలియా పెళ్లి మూడ్ లో కెళ్లిందా?
X
ఆర్.ఆర్.ఆర్ చిత్రంలో న‌టించేందుకు పిలుపు అందుకుంది ఆలియా భ‌ట్. రాజ‌మౌళి బృందం ఇప్ప‌టికే త‌న‌కు షెడ్యూల్ ఎపుడో చెప్పి సెట్లో జాయిన్ అవ్వాల్సిందిగా కోరారు. ఈ న‌వంబ‌ర్ లో ఆలియా సెట్స్ కి వ‌స్తుంద‌న్న చ‌ర్చ కూడా సాగుతోంది. మ‌రి ఇలాంట‌ప్పుడు ఆలియా పెళ్లి వార్త‌లు కంగారు పెడుతున్నాయా? అంటే.. కాస్త వివ‌రాల్లోకి వెళ్లాలి.

జ‌క్కన్న పిలుపు మేర‌కు ఎలాంటి ఇబ్బంది లేకుండా ఆలియా న‌వంబ‌ర్ లో షూటింగుకి ఎటెండ‌వుతుంది. అలాగే సింగిల్ షెడ్యూల్ లోనే ఆలియాపై స‌న్నివేశాల్ని పూర్తి చేసేలా రాజ‌మౌళి ప్లాన్ చేస్తున్నార‌న్న స‌మాచారం ఉంది. అయితే న‌వంబ‌ర్ త‌ర్వాత ఎప్పుడైనా ఆలియా పెళ్ల‌వుతుందా? అంటే తాజాగా ఆ కుటుంబం నుంచి ఓ హింట్ ఊరిస్తూ బ‌య‌టికి వ‌చ్చింది.

రణబీర్ కపూర్ తల్లి రణబీర్ కపూర్ - అలియా భట్ వివాహం గురించి మళ్ళీ మాట్లాడటంపై మీడియా ఊహాగానాలు సాగుతున్నాయి. డ్యాన్సులాడుతూ నీతూ క‌పూర్ క‌నిపించ‌డం చూస్తుంటే ఇదేదో ఇంట్లో పెళ్లి మూడ్ కి సంబంధించిన‌దే అంటూ ముంబై మీడియా ఊహాత్మ‌క క‌థ‌నాలు వెలువ‌రిస్తోంది. ఆమె పెళ్లి వేడుక‌లో జోష్‌ కోసం రిహార్సల్ చేస్తున్నట్లు అంతా భావిస్తున్నారు. నిజం ఏమిటంటే.. పెళ్లి లేదు.. కనీసం మరో సంవత్సరం వ‌ర‌కూ లేదు. నీతుజీకి డాన్స్ చేయడం చాలా ఇష్టం. అందుకే ఇలా క‌నిపించార‌ని ఒక వ‌ర్గం చెబుతోంది.

కపూర్ వంశంలోని ఒక సభ్యుడు ఏమ‌న్నారంటే..,.. “ఈ సంవత్సరం పెళ్లి జరగదు. వచ్చే ఏడాది కూడా ఉండకపోవచ్చు. ఆయన (రిషి కపూర్) ఏప్రిల్ లో కన్నుమూశారు. కాబట్టి 2021 మధ్యకాలం వరకు పెళ్లి గురించి ఖచ్చితంగా ఎటువంటి ప్రశ్న లేదు… .అయితే వారు (రణబీర్-అలియా) ఎప్పుడైనా చట్టబద్ధం చేయాలనే కోరికను వ్యక్తం చేస్తారు. ఈ సందర్భంలో రణబీర్ తల్లి నీతు కపూర్ కి పెళ్లికి ఎటువంటి అభ్యంతరం ఉండదు. కానీ రణబీర్ కపూర్ లేదా అలియా భట్ ప్రస్తుతం వివాహం గురించి ఆలోచించడం లేదు ” అని తెలిపారు. రణబీర్ - అలియాకు ప్రతిపాదిత వివాహం ఇప్పటికీ వాస్తవికతకు దూరంగా ఉందని కపూర్ వంశానికి చెందిన ఆ వ్యక్తి యాడ్ చేయ‌డం చూస్తుంటే ఇప్ప‌ట్లో అవ్వ‌ద‌నే అర్థ‌మ‌వుతోంది. ఏదేమైనా ఆ ఘ‌డియ‌లు వ‌స్తే ఎవ‌రూ ఆప‌లేరు. ఈలోగానే ఆర్.ఆర్.ఆర్ స‌హా పెండింగులో ఉన్న ప్రాజెక్టుల‌న్నీ ఆలియా పూర్తి చేస్తుంద‌న్న‌మాట‌.