Begin typing your search above and press return to search.

అక్కడ బికినీ వేయక చీర కడతారా?

By:  Tupaki Desk   |   14 April 2015 12:08 PM IST
అక్కడ బికినీ వేయక చీర కడతారా?
X
జనాల మతిమరుపుతో గిల్లికజ్జాలు ఆడాలంటే ఏం చేయాలి? మర్చిపోతున్న టైమ్‌లో పబ్లిసిటీ కావాలంటే ఏం చేయాలి? .. ఈ విషయంలో గోదావరి ఫేం.. బీహార్‌ బ్యూటి నీతూచంద్రను సలహా అడిగితే సరైన సలహా పడేస్తుంది. జనాల్ని గిల్లి వదిలేయాలి. రక్కి రక్కి... వెన్న పూయాలి. పంటితో కొరికి తడిగుడ్డ కట్టేయాలి. ఇలాంటి టిప్స్‌ అమ్మడి దగ్గర చాలానే ఉన్నాయి. ఈ సలహాలు సూచనలు విని కంగారు పడొద్దు. ముందు సావధానంగా చదవండి.

గిల్లడం అంటే అప్పుడప్పుడు టూపీస్‌ బికినీ వేసిన ఫోటోని ఏ ట్విట్టర్‌లోనో, ఫేస్‌బుక్‌లోనో షేర్‌ చేస్తే చాలు. కుర్రాళ్లను గిల్లినట్టే. ఈ గిల్లుడు చాలా బాగా పనిచేస్తుంది. రక్కి రక్కి.. అంటే.. జలకమాడే ఫోటోనో, సరసమాడే పిక్‌నో ఒకటి అలా అంతర్జాలంలో ప్రత్యక్షమయ్యేట్టు చేస్తే చాలు. అట్నుంచి బోలెడన్ని కామెంట్లు వచ్చేస్తాయి. తిట్టేవాళ్లు తిడతారు. అడిగేవాళ్లు, కడిగేవాళ్లు వాళ్ల పని వాళ్లు చేసేస్తుంటారు. అప్పట్లో లెస్బియన్‌ యాక్ట్‌తో ఇలానే ప్రచారం తెచ్చుకుంది. ఇప్పుడు మరోసారి అలాంటి స్టింట్‌నే ఉపయోగించింది.

ఈ అమ్మడు సామాజిక వెబ్‌సైట్‌లో ఓ బికినీ పిక్‌ని పోస్ట్‌ చేసింది. అయితే ఇలాంటి ఫోటోలు చూసినప్పుడు మరీ అంత స్పందించకూడదు. హాలీవుడ్‌లో నటించేప్పుడు బికినీ వేయకుండా చీర కట్టుకోవాలా? అని ఎదురు ప్రశ్నించింది. నేనేం వేస్తే మీకెందుకు? నచ్చితే చూడండి. లేకపోతే మానేయండి. జెలసీ ఫెలోస్‌.. అంటూ తిరిగి వెటకారమాడింది. నెరజానవే, చాణక్యం తెలిసిన కోమలాంగివే!.