Begin typing your search above and press return to search.
ట్రోలింగ్ పై నిప్పులు చెరిగిన నీతూకపూర్!
By: Tupaki Desk | 12 May 2022 2:30 AM GMTరణబీర్ కపూర్-అలియాభట్ వివాహ బంధంతో ఒకటైన సంగతి తెలిసిందే. ఏప్రిల్ 14న వివాహం కుటుంబ సభ్యులు. బాలీవుడ్ అతిధుల సమక్షంలో అంగరంగ వైభవంగా జరిగింది. మెహందీ వెడుక నుంచి పెళ్లి తంతు ముగిసే వరకూ జరిగిన హడావుడి అంతా ఇంతా కాదు. కపూర్ ఇంట వారసుడి పెళ్లి అంటే ఎలా ఉంటుందో చూపించారు.
తండ్రి రిషీకపూర్ లేకపోయినా ఆ లోటు ఎక్కడా కనిపించకుండా తల్లి నీతూకపూర్ కుమారుడు రణబీర్ వివాహం వైభంగా జరిపించారు. ఇక పెళ్లి వేడుకలో నీతు కపూర్ డాన్సులతో చేసిన హంగామా అంతా ఇంతా కాదు. నవదంపతులతో పాటు నీతు కూడా తనదైన శైలిలో స్టెప్ అందుకున్నారు. అయితే వివాహం అనంతరం వాటికి సంబంధించిన ఫోటోలు..వీడియోలు నెట్టింట వైరల్ గా మారాయి.
దీంతో నెటిజన్స్ నీతూకపూర్ ని ట్రోలింగ్ చేశారు. ఓ నెటి జనుడు కాస్త హద్దు మీరి ఓ కామెంట్ పెట్టాడు. భర్త లేకుండా కుమారుడి పెళ్లిలో చిన్న పిల్లలా ఆ డాన్సులేంటి? అని ప్రశ్నించి ట్రోల్ చేసాడు. తాజాగా ఈ ట్రోలింగ్ పై నీతూ కపూర్ తనదైన శైలిలో స్పందించారు.
``ఆ కామెంట్ పెట్టిన వాడిని వెంటనే బ్లాక్ చేశాను. సమాజంలో ఎలా ఉండాలో? నాకు నీతులు చెబుతున్నావా? ముందు నువ్వెంత సంస్కారవంతంగా ఉన్నావో తెలుసుకో. విధవ లాగా ఎల్లప్పుడు ఏడుస్తూ ఉండాలని సమాజంలోని కొంతమంది కోరుకుంటారు. అలాంటి వారిని నేను బ్లాక్ చేస్తాను. నా భర్తని ఏనాడు మర్చిపోను. కలకాలం నా మనసులోనే ఉంటాడు.
నా పిల్లల జీవితాల్లో వారిని చూసుకుంటున్నాను. సంతోషం..దుఖం వచ్చినప్పుడు అందరూ ఒకేలా ఉండరు. కొందరు ఏడుస్తారు. మరికొందరు ఏడవరు. డైలీ రిషీ కపూర్ గురించి ఇంట్లో చర్చ జరుగుతుది. భోజనం చేసే సమయంలో ఆయన గురించి మాట్లాడుకుంటాం. రణ్‌బీర్ ఫోన్‌లో ఇప్పటికీ స్క్రీన్ సేవర్‌గా రిషి ఫొటోనే ఉంటుందని` తెలిపారు.
రిషి కపూర్-నీతూ కపూర్ తొలిసారి `జెహ్రీలా ఇన్సాన్' సినిమా సెట్లో కలుసుకున్నారు. ఈ సినిమా 1980లో విడుదలైంది. ఆ తర్వాత 'అమర్ అక్బర్ ఆంటోనీ' .. 'ఖేల్ ఖేల్ మే' .. 'కబీ కబీ' సినిమాల్లో జంటగా నటించారు.