Begin typing your search above and press return to search.

సాంగ్ టీజ‌ర్ : మ‌ళ్లీ ఆర్పీ బాణీ వినిపిస్తోంది!

By:  Tupaki Desk   |   17 Sep 2022 12:21 PM GMT
సాంగ్ టీజ‌ర్ : మ‌ళ్లీ ఆర్పీ బాణీ వినిపిస్తోంది!
X
బెల్లంకొండ శ్రీ‌నివాస్‌, కాజ‌ల్ అగ‌ర్వాల్ ల క‌ల‌యిక‌లో రూపొందిన‌ 'సీత'తో ద‌ర్శ‌కుడు తేజ బిగ్ డిజాస్ట‌ర్ ని సొంతం చేసుకున్నాడు. ఈ మూవీ త‌రువాత రెండేళ్లు విరామం తీసుకున్న తేజ స్టార్ ప్రొడ్యూస‌ర్ ద‌గ్గుబాటి సురేష్ త‌న‌యుడు, రానా సోద‌రుడు అభిరామ్ ని హీరోగా ప‌రిచ‌యం చేస్తున్న విష‌యం తెలిసిందే. 'అహింస‌' పేరుతో రూపొందుతున్న ఈ మూవీని ఆనంది ఆర్ట్స్ బ్యాన‌ర్ పై పి. కిర‌ణ్ నిర్మిస్తున్నారు.

గీతిక హీరోయిన్ గా పరిచ‌యం అవుతోంది. 'చిత్రం' నుంచి 'ల‌క్ష్మీ క‌ల్యాణం' వ‌ర‌కు ఎంతో మంది స్టార్స్ ని ఇండ‌స్ట్రీకి ప‌రిచ‌యం చేసిన తేజ ప్ర‌స్తుతం 'అహింస‌'తో ద‌గ్గుబాటి వారి వార‌సుడిని హీరోగా తెర‌పైకి తీసుకొస్తున్నారు.

ఇటీవ‌లే ఫ‌స్ట్ గ్లింప్స్ ని విడుద‌ల చేశారు. అభిరామ్ ముఖానికి జ‌న‌ప‌నార సంచిని కవ‌ర్ చేసిక‌ట్టి ఓ గ్రూప్ అత‌న్ని కొండ‌ల మ‌ధ్య లాక్కుంటూ వెళుతుంటే నోటి నుంచి బ్లాడ్ కారుతున్న దృశ్యాలు ఆస‌క్తిని రేకెత్తిస్తున్నాయి.

న‌టీన‌టుల వేష‌ధార‌ణ కొంత విచిత్రంగా క‌నిపిస్తోంది. ఇదిలా వుంటే ఈ శుక్ర‌వారం ఈ మూవీలోని ప్ర‌ధాన పాత్ర‌ల‌ని ప‌రిచ‌యం చేస్తూ వారి వాయిస్ డైలాగ్‌ ల‌తో మోష‌న్ పోస్ట‌ర్స్ ని విడుద‌ల చేశారు. సినిమాలో అభిరామ్ ఇన్నోసెంట్ అయిన యువ‌కుడు ర‌ఘు పాత్ర‌లో క‌నిపించ‌బోతున్నాడు. శ‌నివారం 'నీతోనే నీతోనే..' అంటూ సాగే ఫ‌స్ట్ లిరిక‌ల్ సాంగ్‌ ప్రోమోని విడుద‌ల చేశారు. చాలా ఏళ్ల విరామం త‌రువాత ఆర్పీ ప‌ట్నాయ‌క్ ఈ చిత్రానికి సంగీతం అందించారు.

చంద్ర‌బోస్ సాహిత్యం అందించిన ఈ పాట‌ని సిద్ శ్రీ‌రామ్ ఆల‌పించాడు. తేజ‌, ఆర్పీ ప‌ట్నాయ‌క్ ల కల‌యిక‌లో 'చిత్రం' నుంచి ల‌క్ష్మీ క‌ల్యాణం' వ‌ర‌కు ఎన్నో బ్లాక్ బ‌స్ట‌ర్ ఆల్బ‌మ్స్ వ‌చ్చాయి. మ‌ళ్లీ ఇన్నేళ్ల‌కు ఈ ఇద్ద‌రు క‌లిసి వ‌ర్క్ చేస్తున్న సినిమా కావ‌డంతో ఈ చిత్ర ఆడియోపై మంచి అంచ‌నాలు ఏర్ప‌డ్డాయి.

అందుకు త‌గ్గ‌ట్టుగానే ఫ‌స్ట్ లిరిక‌ల్ సాంగ్ మెలోడియ‌స్ గా సాగుతూ ఆక‌ట్టుకునేలా వుంది. చాలా కాలం త‌రువాత మ‌ళ్లీ ఆర్పీ బాణీ వినిపిస్తున్న‌ట్టుగా తెలుస్తోంది. ఈ సినిమాతో తేజ‌, ఆర్పీ మ‌ళ్లీ ఆనాటి మ్యాజిక్ ని రిపీట్ చేస్తారేమో చూడాలంటే పూర్తి సాంగ్ రిలీజ్ వ‌ర‌కు వేచి చూడాల్సిందే.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.