Begin typing your search above and press return to search.

డిస్ట్రిబ్యూటర్ గా మారిన స్టైలిష్ట్

By:  Tupaki Desk   |   3 July 2017 4:02 AM GMT
డిస్ట్రిబ్యూటర్ గా మారిన స్టైలిష్ట్
X
నీరజ కోన.. టాలీవుడ్ లో చాలా మంది స్టార్ హీరోయిన్స్ కు స్టైలిష్ట్. డిజైనింగ్ లో నావెల్టీ చూపించే ఈమెకు స్టైలిష్ట్ బాధ్యతలు అప్పజెప్పేందుకు అనేక మంది తారలు సిద్ధంగా ఉంటారు. అయితే.. ప్రతీవారిలోనూ కొన్ని ఇంటర్నల్ ట్యాలెంట్స్ కూడా ఉంటాయి. అలా తనలోని రైటింగ్ ప్రతిభను ఇప్పటికే చూపింది నీరజ కోన.

గతేడాది విడుదల అయిన సాయి ధరం తేజ్ మూవీ తిక్క కోసం ఈమె తొలిసారిగా పాట రాసింది. సినిమా సక్సెస్ కాకపోవడంతో.. ఈమె పాటకు గుర్తింపు దక్కలేదు. అయితే.. త్వరలో విడుదల కానున్న గోపీచంద్ మూవీ గౌతమ్ నంద కోసం కూడా ఈమె ఒక పాట రాసింది. ఈ స్టైలిష్ట్ ను తేజు గీత రచయితగా మారిస్తే.. హీరో నాని ఈమెకు మరో క్రెడిట్ కట్టబెట్టేస్తున్నాడు. ఈమెను డిస్ట్రిబ్యూటర్ గా మార్చేస్తున్నాడు. నాని లేటెస్ట్ మూవీ నిన్ను కోరి మూవీని నీరజ కోన డిస్ట్రిబ్యూట్ చేయనుంది. ఈ విషయాన్ని తన ట్విట్టర్ అకౌంట్ ద్వారా అఫీషియల్ గా ప్రకటించింది నీరజ కోన.

యూఎస్ఏ లోని డల్లాస్ ప్రాంతంలో నిన్ను కోరి మూవీ డిస్ట్రిబ్యూటషన్ నీరజ కోన చేతుల మీదగానే జరగనుంది. ప్రస్తుతం యూఎస్ లో డిస్ట్రిబ్యూషన్ రిస్కీగా మారిపోయింది. మొత్తం వసూళ్లలో డిస్ట్రిబ్యూటర్లకు 40 శాతం వాటా మాత్రమే వస్తున్న తరుణంలో.. నీరజ కోన ఇంత ధైర్యంగా ఈ రంగంవైపు అడుగులు వేయడాన్ని పలువురు ఆసక్తిగా గమనిస్తున్నారు. జూన్ 7న విడుదల కానున్న నిన్ను కోరి మూవీలో నానితో పాటు నివేదా థామస్.. ఆది పినిశెట్టి కూడా నటిస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/