Begin typing your search above and press return to search.

కోన సిస్ట‌ర్.. కోలీవుడ్ లోకి గ్రాండ్ ఎంట్రీ

By:  Tupaki Desk   |   15 Oct 2016 5:18 PM GMT
కోన సిస్ట‌ర్.. కోలీవుడ్ లోకి గ్రాండ్ ఎంట్రీ
X
నీర‌జ కోన‌.. టాలీవుడ్ జ‌నాల‌కు కొత్త‌గా ప‌రిచ‌యం చేయాల్సి న అవ‌స‌రం లేని పేరు. గ‌త మూణ్నాలుగేళ్ల‌లో బాగా పాపుల‌ర్ అయింది ఈ పేరు. కోన వెంక‌ట్ చెల్లెలైన నీర‌జ‌.. - త్రిష - రకుల్ ప్రీత్ సింగ్ - నయనతార సహా చాలామంది సౌత్ టాప్ హీరోయిన్లకు స్టైలిస్ట్‌ గా - కాస్ట్యూమ్ డిజైనర్‌ గా పని చేసింది. హీరోల్లో సాయిధరమ్ తేజ్.. నితిన్ లాంటి వాళ్లు కూడా ఈమె క్ల‌యింట్లే. తెలుగులో చాలా సినిమాల‌కు స్టైలిస్ట్ గా ప‌ని చేసిన నీర‌జ‌.. ఇప్పుడు కోలీవుడ్ లోకి కూడా అడుగుపెట్టేస్తోంది. ఒక భారీ ప్రాజెక్టుతోనే ఆమె కోలీవుడ్ లోకి ఎంట్రీ ఇస్తోంది.

కోలీవుడ్ లో య‌మ రైజింగ్ లో ఉన్న యువ క‌థానాయ‌కుడు శివ కార్తికేయ‌న్ క‌థానాయ‌కుడిగా తెర‌కెక్కే కొత్త సినిమాకు స్టైలిష్ట్ గా ప‌ని చేయ‌బోతోంది నీర‌జ కోన‌. ఈ సినిమాలో న‌య‌న‌తార క‌థానాయిక‌గా న‌టిస్తోంది. గ‌త ఏడాది త‌నీ ఒరువ‌న్ లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ తీసిన మోహ‌న్ రాజా ఈ చిత్రానికి ద‌ర్శ‌క‌త్వం వ‌హిస్తున్నాడు. శివ కార్తికేయ‌న్ తో ఇటీవ‌లే ‘రెమో’ సినిమాను నిర్మించిన 24 ఏఎం స్టూడియో సంస్థ ఈ సినిమాను నిర్మిస్తోంది. ఈ సినిమాలో మ‌ల‌యాల న‌టుడు ఫాహ‌ద్ ఫాజిల్ విల‌న్ క్యారెక్ట‌ర్ చేస్తున్నాడు. ఒకప్ప‌టి స్టార్ హీరోయిన్ స్నేహ కూడా ఇందులో ఓ కీల‌క పాత్ర చేస్తున్నాడు. శివ కార్తికేయ‌న్ కెరీర్ లోనే భారీ బ‌డ్జెట్ తో ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.

Like Us on Facebook : https://www.facebook.com/Tupakidotcom/