Begin typing your search above and press return to search.

పాక్‌ లో ర‌కుల్ కు నో ఎంట్రీ

By:  Tupaki Desk   |   16 Feb 2018 11:04 AM GMT
పాక్‌ లో ర‌కుల్ కు నో ఎంట్రీ
X
ర‌కుల్ ప్రీత్ సింగ్ హీరోయిన్‌గా చేసిన తొలి బాలీవుడ్ సినిమా అయ్యారి. ఈ రోజు ఆ సినిమా ప్ర‌పంచ వ్యాప్తంగా విడుద‌లైంది. దేశ భ‌క్తి, మ‌న శ‌క్తి వంత‌మైన ఆర్మీ నేప‌థ్యంలో సాగిన క‌థ ఇది. ఈ సినిమాను పాకిస్తాన్‌ లో విడుద‌ల చేయ‌నివ్వ‌లేదు అక్క‌డి సెన్సార్ బోర్డు. ఎందుకంటే ఆ సినిమాలో భార‌త ఆర్మీని చాలా గొప్ప‌గా చూపించారు.

పాక్‌ లో ఏ సినిమాలైనా విడుద‌ల‌వుతాయి కానీ... భార‌త ఆర్మీని బ‌లంగా - భార‌త అధికారుల‌ను తెలివైన వారుగా చూపించే సినిమాల‌కు మాత్రం ఎంట్రీ ఉండ‌దు. భార‌త ఆర్మీని గొప్ప‌గా చూపించారంటే అందులో పాక్ గురించి ఏదో ఒక సీన్ క‌చ్చితంగా ఉంటుంది. అందుకే పాక్ వారి ఏడుపు. భార‌త్‌ ను గొప్ప‌గా చూపించే ఏ సినిమాను పాక్‌ లో విడుద‌ల కానివ్వ‌రు. నిషేధం విధిస్తారు. ఇప్పుడు అలా నిషేధం విధించిన సినిమా జాబితాలో అయ్యారి కూడా చేరిపోయింది. ఆ సినిమా ద‌ర్శ‌కుడు నీర‌జ్ పాండే తీసిని మూడో సినిమా ఇది.

నీర‌జ్ పాండే గ‌తంలో బేబీ ...నామ్ ష‌బానా అనే సినిమాలు తీశాడు. ఆ రెండింటిలో దేశ‌భ‌క్తి సీన్లు ఉన్నాయి. దీంతో ఆ సినిమాలు కూడా పాక్‌ లో విడుద‌ల‌కు నోచుకోలేదు. ముచ్చ‌ట‌గా మూడో సినిమా కూడా అదే ప‌రిస్థితి. అయ్యారిలో కేవ‌లం భార‌త ఆర్మీ బ‌ల‌మే కాదు... వారు ప‌రిస్థితుల‌కు త‌గ్గ‌ట్టు చ‌క్క‌టి... తెలివైన నిర్ణ‌యాలు ఎలా తీసుకుంటారో కూడా చూపించారు. అందుకే పాక్ కుళ్లుతో సినిమాపై నిషేధం విధించింది.