Begin typing your search above and press return to search.

'బంగారు' కొండ బయోపిక్‌ రాబోతుందట

By:  Tupaki Desk   |   9 Aug 2021 6:30 AM GMT
బంగారు కొండ బయోపిక్‌ రాబోతుందట
X
మూడు రోజుల క్రితం వరకు నీరజ్ చోప్రా గురించి పెద్దగా ఎవరికి తెలియదు. ఎప్పుడైతే అతడు ఒలింపిక్స్ లో మొదటి రౌండ్ లోనే అద్బుతమైన త్రో తో టాప్ లో నిలిచాడో అప్పుడే అతడి గురించి దేశం మొత్తం మాట్లాడుకుంది. కేవలం 15 నిమిషాల వ్యవధిలో నేషనల్‌ హీరోగా సోషల్‌ మీడియాలో ట్రెండ్డింగ్‌ లోకి నీరజ్ వచ్చేశాడు. జావెలిన్ త్రో తో ఇండియాకు మొదటి బంగారంను తెచ్చి పెట్టిన బంగారు కొండ అతడు. ఇప్పటి వరకు ఒలింపిక్స్ చరిత్రలో ఇండియాకు అథ్లెటిక్స్ లో బంగారు పతకం వచ్చింది లేదు. ఇక ఈ ఏడాది ఒలింపిక్స్ లో కూడా బంగారు పతకం రాలేదు. ఎన్నో రికార్డులు క్రియేట్‌ చేస్తూ 140 కోట్ల మంది అంచనాలు నిలబెడుతూ బంగారంను దక్కించుకున్న నీరజ్ చోప్రా గురించి ఇప్పుడు ఎక్కడ చూసినా చర్చ జరుగుతోంది.

ఈమద్య కాలంలో క్రీడాకారుల బయోపిక్ లు రూపొందుతున్నాయి. క్రికెటర్లు మరియు ఇతర క్రీడలకు సంబంధించిన ఆటగాళ్ల బయోపిక్ మాత్రమే కాకుండా ప్రముఖుల బయోపిక్ లు వరుసగా తెరకెక్కుతున్నాయి. ఇలాంటి సమయంలో నీరజ్ చోప్రా బయోపిక్ ను కూడా ప్లాన్ చేస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం బాలీవుడ్‌ సూపర్ స్టార్‌ అక్షయ్‌ కుమార్‌ ఈ బయోపిక్ ను చేసేందుకు చాలా ఆసక్తిగా ఉన్నాడు అనేది టాక్‌. అయితే నీరజ్‌ చోప్రా బయోపిక్ పై రణదీప్ హుడా పేరు కూడా వినిపిస్తుంది.

కొన్నాళ్ల క్రితం ఒక ఇంటర్వ్యూలో నీరజ్ చోప్రా మాట్లాడుతూ తన బయోపిక్ ను చేయాలంటే బాలీవుడ్‌ స్టార్ అక్షయ్‌ కుమార్ లేదా నీరజ్‌ చోప్రా చేయాలని వ్యాఖ్యలు చేశాడట. ఇప్పుడు నీరజ్‌ బంగారు పతక విజేత కనుక బాలీవుడ్‌ తో పాటు అన్ని వుడ్స్ హీరోలు కూడా బయోపిక్ కు క్యూ కట్టే అవకాశం ఉంది. ఇప్పుడు కాకున్నా కాస్త సమయం పట్టినా కూడా ఈ సినిమా మాత్రం పట్టాలు ఎక్కడం పక్కా అన్నట్లుగా బాలీవుడ్‌ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. నీరజ్ చోప్రా బయోపిక్‌ లో ఎన్నో నాటకీయ పరిణామాలు ఉన్నాయట. ఖచ్చితంగా సినిమా ఓ రేంజ్‌ లో ఉంటుందని.. కమర్షియల్‌ ఎలిమెంట్స్ కు కూడా మస్త్‌ స్కోప్‌ ఉంటుందని భావిస్తున్నారట. త్వరలోనే నీరజ్‌ చోప్రాకు సంబంధించిన బయోపిక్ పై ఒక క్లారిటీ వస్తుందేమో చూడాలి