Begin typing your search above and press return to search.

ముద్దు సీన్ తర్వాత డెటాల్ తో నోరు కడుక్కుందట!

By:  Tupaki Desk   |   28 Jun 2023 11:30 PM IST
ముద్దు సీన్ తర్వాత డెటాల్ తో నోరు కడుక్కుందట!
X
బాలీవుడ్ సీనియర్ హీరోయిన్ నీనా గుప్తా మరోసారి వార్తల్లో నిలిచింది. ఈమె బూతు సిరీస్ లస్ట్‌ స్టోరీస్ సీజన్ 2 లో ముఖ్య పాత్రలో కనిపించింది. ఈమె చేసిన పాత్ర పై కొందరు ట్రోల్స్ చేస్తూ ఉంటే మరి కొందరు మాత్రం ఇలాంటి వయసులో అలాంటి పాత్ర లు డైలాగ్స్ అవసరమా అంటూ విమర్శిస్తూ ఉన్నారు.

లస్ట్‌ స్టోరీస్ 2 సిరీస్‌ ట్రైలర్‌ విడుదల తర్వాత నీనా గుప్త గురించి ప్రధానంగా చర్చ జరుగుతోంది. ఇలాంటి సిరీస్ లు రావాలి.. ఈ తరం పిల్లలకు శృంగార సంబంధిత విషయాలు తెలియాల్సిన అవసరం ఉందని.. ఒకప్పుడు అలాంటి వాటి గురించి తెలియక పోవడంతో అపోహల్లో బతికేవాళ్లం. కానీ ఇప్పుడు పిల్లలకు అన్ని విషయాలు తెలియాల్సిన అవసరం ఉంది.. అందుకో లస్ట్‌ స్టోరీస్‌ వంటి సిరీస్ లను చూడాల్సిన అవసరం ఉందని కూడా ఆమె పేర్కొన్నారు.

తాజాగా నీనా గుప్తా తన మొదటి ముద్దు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ఇండియాస్ ఫస్ట్‌ మెగా సీరియల్‌ లో నేను నటించాను. ఆ సమయంలో నేను దిలీప్ ధావన్‌ తో కలిసి ఆ సీరియల్‌ లో నటించాను. ఆయనతో ముద్దు సన్నివేశాల్లో నటించాల్సి వచ్చింది. ఒక సన్నివేశం లో ముద్దు పెట్టాల్సి వచ్చింది.

దిలీప్ ధావన్ చూడ్డానికి బాగానే ఉంటాడు.. అతడితో సన్నిహిత్యం ఉంది. కానీ అతడితో ముద్దు సన్నివేశాలకు నేను సిద్ధంగా లేదు. అందుకే ఆ సమయంలో నేను ముద్దు సన్నివేశం చేసిన తర్వాత నోటిని డెటాల్ తో కడుక్కున్నాను అంటూ అప్పటి జ్ఞాపకాలను నీనా గుప్తా పేర్కొన్నారు.