Begin typing your search above and press return to search.
ప్రదీప్ మాచిరాజు క్రేజ్ కు ఇదే నిదర్శనం
By: Tupaki Desk | 4 Feb 2020 1:17 PM ISTబుల్లి తెరపై స్టార్ యాంకర్ గా పేరు దక్కించుకున్న ప్రదీప్ మాచిరాజుకు ఉన్న ఫ్యాన్ ఫాలోయింగ్ గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. బుల్లి తెర సూపర్ స్టార్ అంటూ ఆయన అభిమానులు పిలుచుకుంటూ ఉంటారు. ఆయన ఏ షో చేసినా కూడా అది సూపర్ హిట్. ఆయన ఎక్కడ కనిపించినా ఆ కార్యక్రమం బ్లాక్ బస్టర్. అలాంటి ప్రదీప్ '30 రోజుల్లో ప్రేమించడం ఎలా' అనే చిత్రంతో ప్రేక్షకుల ముందుకు వచ్చేందుకు రెడీ అయ్యాడు. సైలెంట్ గా షూటింగ్ పూర్తి చేసి ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ వర్క్ చేస్తున్నారు.
సినిమాను త్వరలో విడుదల చేయనున్న నేపథ్యం లో తాజాగా మహేష్ బాబు చేతుల మీదుగా నీలినీలి ఆకాశం అనే మొదటి పాటను విడుదల చేయించారు. పాట విడుదల అయ్యే వరకు పెద్దగా ఎవరు పట్టించుకోలేదు. కాని పాట విడుదలైన తర్వాత ఎక్కడ చూసినా అదే వినిపిస్తుంది కనిపిస్తుంది. సోషల్ మీడియాలో మారుమ్రోగిపోతున్న ఈ పాటకు ఇప్పటి వరకు యూట్యూబ్ లో ఏకంగా ఏడు మిలియన్ ల వ్యూస్ వచ్చాయి.
రెండు రోజుల పాటు కంటిన్యూస్ గా ఈ పాట యూట్యూబ్ లో నెం.1 గా ట్రెండ్ అయ్యింది. యూట్యూబ్ లో ఇంకా కూడా ఈ పాట ట్రెండ్ అవుతూనే ఉంది.
బుల్లి తెరపై మెప్పించిన ప్రదీప్ హీరోగా సెట్ అవుతాడా అనే అనుమానాలను ఈ పాటకు వస్తున్న స్పందన పట్టాపంచలు చేసేసింది. ఖచ్చితంగా ప్రదీప్ ఈ చిత్రంతో ప్రదీప్ ను హీరోగా ప్రేక్షకులు ఆధరిస్తారంటూ విశ్లేషకులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. ప్రదీప్ కు ఉన్న ఫాలోయింగ్ సినిమాకు ఓపెనింగ్స్ కలెక్షన్స్ రూపంలో రాబోతున్నట్లుగా కూడా చెబుతున్నారు. ఈ పాటను సిడ్ శ్రీరామ్ మరియు సునీతలు పాడటం వల్ల కూడా ప్రేక్షకులను మెప్పించగలిగిందని కొందరు అంటున్నారు.