Begin typing your search above and press return to search.

అనురాగ్ ఫ్రస్ట్రేషన్ తో వదిలిన బ్యూటిఫుల్ 'ప్రేమ్ కుమార్' మెలోడీ..!

By:  Tupaki Desk   |   5 Feb 2022 8:09 AM GMT
అనురాగ్ ఫ్రస్ట్రేషన్ తో వదిలిన బ్యూటిఫుల్ ప్రేమ్ కుమార్ మెలోడీ..!
X
'ఏక్ మినీ కథ' ఫేమ్ సంతోష్ శోభన్ నటించిన తాజా చిత్రం ''ప్రేమ్ కుమార్''. ఈ యూత్‌ ఫుల్ రొమాంటిక్ కామెడీ ఎంటర్టైనర్ తో అభిషేక్ మహర్షి అనే కొత్త దర్శకుడు ఇండస్ట్రీకి పరిచయం అవుతున్నారు. ఇందులో సంతోష్ సరసన రాశీ సింగ్ హీరోయిన్‌ గా నటించింది. ఇప్పటికే విడుదలైన ఫస్ట్ లుక్ - గ్లింమ్స్ వంటి ప్రమోషన్ కంటెంట్ సినిమాపై ఆసక్తిని కలిగించింది. ఈ క్రమంలో సినిమాలో సింగర్ అనురాగ్ కులకర్ణి పాడిన 'నీలాంబరం' అనే మెలోడీ సాంగ్ ను రిలీజ్ చేశారు.

'ప్రేమ్ కుమార్' సినిమాకు సంబంధించిన అప్డేట్స్ ఇవ్వడం లేదంటూ అనురాగ్ కులకర్ణి ఫ్రస్ట్రేట్ అవుతున్నట్లు రెండు రోజుల క్రితం ఓ వీడియోను పోస్ట్ చేశారు. తాను ఈ సినిమాలో పాడిన 'నీలాంబరం' అనే పాట బాగుందని టీమ్ నుంచి అందరూ ఫోన్లు చేసి మెచ్చుకుంటున్నారని.. కానీ మేకర్స్ పాటను మాత్రం రిలీజ్ చేయడం లేదని ఆవేదన చెందుతూ మాట్లాడారు. ప్రేమ్ కుమార్ కు పెళ్లి ఎప్పుడు అవుద్దో.. నా పాట ఎప్పుడు రిలీజ్ అవుద్దో తెలియడం లేదు అన్నారు.

అందుకే ప్రేక్షకులు అందరూ మెచ్చాలని పాడిన ఈ సాంగ్ ను ఆదిత్య మ్యూజిక్ వారితో కలిసి తానే స్వయంగా విడుదల చేయనున్నట్లు అనురాగ్ పేర్కొన్నారు. మూవీ ప్రమోషన్స్ లో భాగంగా చేసిన ఈ వీడియో నెట్టింట వైరల్ అయింది. ఈ నేపథ్యంలో ముందుగా చెప్పినట్లుగానే శనివారం ఉదయం 'నీలాంబరం' పాటను వదిలారు. ''నీలాంబరం చూసి నీ కళ్లలో.. మేఘామృతం జారీ నా గుండెలో.. మాటలను మోయలేని పెదవే.. మౌనంగా నిన్ను సాయమడిగే..' అంటూ సాగిన ఈ మెలోడీ గీతం శ్రోతలను అలరిస్తోంది.

ప్రేమించిన అమ్మాయి గురించి ప్రేమ్ కుమార్ తనలోని భావాలను వ్యక్తపరిచే విధంగా ఈ పాటకు కిట్టు విస్సాప్రగడ సాహిత్యం రాసారు. దీనికి అనంత్ శ్రీకర్ బ్యూటిఫుల్ ట్యూన్ కంపోజ్ చేసారు. సింగర్ అమృతా ఆనంద్ తో కలిసి అనురాగ్ కులకర్ణి తన వాయిస్ తో మరోసారి మ్యాజిక్ క్రియేట్ చేశారు. రాంపీ నందిగాం ఈ చిత్రానికి సినిమాటోగ్రఫీ అందించగా.. గ్యారీ బీహెచ్ ఎడిటింగ్ వర్క్ చేసారు. 'ప్రేమ్ కుమార్' చిత్రాన్ని సారంగ ఎంటర్‌టైన్‌మెంట్స్ పై.లి. పతాకంపై శివప్రసాద్ పన్నీరు నిర్మిస్తున్నారు. త్వరలోనే ఈ సినిమా విడుదల తేదీని ప్రకటించనున్నారు.