Begin typing your search above and press return to search.

ట్రైలర్ టాక్‌: వాటే ఇంట్రెస్టింగ్ కథ

By:  Tupaki Desk   |   16 March 2018 4:50 AM GMT
ట్రైలర్ టాక్‌: వాటే ఇంట్రెస్టింగ్ కథ
X
హీరో శ్రీవిష్ణుకు కెరియర్లో సరైన హిట్టు పడలేదేమో కాని.. అతను మాత్రం తన సినిమాలతో ఇంప్రెస్ చేయడం అస్సలు మానడు. అప్పట్లో ఒకడుండేవాడు.. మెంటల్ మదిలో వంటి సినిమాలతో మనోడు చాలానే ఆకట్టుకున్నాడు. ఇప్పుడు కూడా అటువంటి సినిమాతోనే మరోసారి వస్తున్నాడు. ఈసారి ఒక కొత్త కుర్రాడి డైరక్షన్లో.. ''నీది నాది ఒకే కథ'' అనే సినిమాతో శ్రీవిష్ణు ఏం చేయబోతున్నాడో ఒక ట్రైలర్ ద్వారా చూపించేశాడు.

విజయానికి ఐదు మెట్లు.. సక్సెస్ ఏడు సూత్రాలు.. వంటి పుస్తకాలు చదివేసి.. ఆ తరువాత పరీక్షల్లో ఇంకా బాగా రాసేసి.. జీవితంలో సక్సెస్ అవ్వాలనుకునే ఒక బడి పంతులు కొడుకు మన హీరో. చివరకు ఒక హీరోయిన్ ను పట్టుకుని.. ఆమె సాయంతో ఇంకా బాగా చదవాలనుకుంటున్నాడు. అయితే అవన్నీ అడియాశలే అవుతాయి. అయితే ఎప్పుడూ తల్లిదండ్రుల గురించి ఆలోచించకుండా.. వారికి బ్యాడ్ నేమ్ తీసుకొచ్చే సిట్యుయేషన్ ఒకటి వస్తుంది. అప్పుడు ఏం జరిగింది అనేదే కథ. శ్రీవిష్ణు సింపుల్ గా ఇరగదీస్తే.. సినిమాలో కొత్తబ్బాయ్ వేణు ఉడుగుల రాసిన డైలాగులు అదిరిపోయాయ్. అలాగే సురేష్‌ బొబ్బిలి మ్యూజిక్ గా భలేగా ఉంది. బిచ్చగాడు ఫేం హీరోయిన్ సాట్నా టైటస్ కూడా బాగానే ఉంది.

మార్చి 25న కళ్యాణ్‌ రామ్ ఎం.ఎల్.ఏ తో క్లాష్‌ అవుతుంది అన్నప్పుడు.. అబ్బే ఈ సినిమా ఎందుకు ఇలాంటి దుస్సాహసం చేస్తోంది అని చాలామంది అనుకున్నారు కాని.. ఇప్పుడు మాత్రం ఈ సినిమాలో కంటెంట్ చూశాక.. ఖచ్చితంగా ఈ సినిమాకు ఒక సెట్టాఫ్‌ ఆడియన్స్ ఉంటారని అర్ధమైపోతోంది. మరి చాలామందిది జీవితంలో ఇదే ఇంట్రెస్టింగ్ కథ అయినప్పుడు.. సహజంగానే ఆసక్తి పెరుగుతుంది కదా.

ట్రైలర్ కోసం చేయండి