Begin typing your search above and press return to search.

మంచి సినిమా చచ్చిపోయింది

By:  Tupaki Desk   |   14 April 2018 7:56 AM GMT
మంచి సినిమా చచ్చిపోయింది
X
మూడు వారాల కిందట పెద్దగా అంచనాల్లేకుండా విడుదలైంది ‘నీదీ నాదీ ఒకే కథ’ సినిమా. ఈ చిత్రానికి చాలా మంచి టాక్ వచ్చింది. తెలుగులో ఇలాంటి సినిమా రావడం అరుదనే చెప్పాలి. విమర్శకులు దీన్నో క్లాసిక్ గా అభివర్ణించారు. కానీ ఈ చిత్రం జనాల్లోకి వెళ్లడానికి కొంచెం టైం పట్టింది. అలా కలెక్షన్లు పుంజుకునే సమయానికే పెద్ద బ్రేక్ పడింది. తర్వాతి వారం ‘రంసగ్థలం’ హంగామా మొదలైపోయింది. గురువారం నుంచే ‘రంగస్థలం’ హడావుడి మొదలైపోయింది. ఇక ఈ చిత్రానికి పాజిటివ్ టాక్ రావడంతో వసూళ్ల మోత మోగిపోయింది. ఈ ఏడాది సరైన పెద్ద సినిమాల లేక ఆవురావురుమని ఉన్న ప్రేక్షకులు ‘రంగస్థలం’ థియేటర్లను ముంచెత్తారు.

ఈ క్రమంలో థియేటర్లలో ఉన్న మిగతా సినిమాల్ని ఎవరూ పట్టించుకోలేదు. వాటి గురించి అసలు డిస్కషనే లేదు. ‘రంగస్థలం’కు పాజిటివ్ టాక్ వచ్చిన నేపథ్యంలో మెజారిటీ థియేటర్లలో దాన్నే నడిపించారు. ఈ చిత్రం రెండో వారంలో సైతం కళ్లు చెదిరే వసూళ్లతో సాగిపోయింది. ‘నీదీ నాదీ ఒకే కథ’ రెండో వీకెండ్ కు వచ్చేసరికి పోటీ లేకపోతే మంచి వసూళ్లు సాధించేదేమో. కానీ ‘రంగస్థలం’ వచ్చి ఆ సినిమాకు అవకాశం లేకుండా చేసింది. ఐతే ఈ చిత్రానికి మంచి రివ్యూలు.. టాక్ వచ్చిన నేపథ్యంలో శాటిలైట్ హక్కులు మంచి రేటుకే అమ్ముడయ్యే అవకాశముంది. కొత్త దర్శకుడు వేణు ఉడుగుల ఈ చిత్రాన్ని రూపొందించగా.. నారా రోహిత్ సమర్పణలో కృష్ణ విజయ్.. ప్రశాంతి ఈ చిత్రాన్ని నిర్మించారు. రూ.కోటి లోపు బడ్జెట్లో ఈ చిత్రాన్ని నిర్మించినట్లు సమాచారం.