Begin typing your search above and press return to search.
`ఆహా`లో లేటెస్ట్ సస్పెన్స్ థ్రిల్లర్ `నీడ`
By: Tupaki Desk | 10 July 2021 9:39 AM ISTఓటీటీల్లో థ్రిల్లర్ సినిమాలకు ఉన్న ఆదరణ అంతా ఇంతా కాదు. వెబ్ సిరీస్ అయినా సినిమా అయినా అనుక్షణం ఉత్కంఠ కలిగించగలిగితే ఓటీటీల్లో ఆదరణకు ఛాన్సుంది. ఇప్పుడు అలాంటి ఓ థ్రిల్లర్ సినిమాని తెలుగు ప్రేక్షకులకు అందిస్తోంది `ఆహా`.
సస్పెన్స్ థ్రిల్లర్ కేటగిరీలో తమిళంలో రిలీజైన `నిజల్` మూవీకి తెలుగానువాదం `నీడ` పేరుతో ఆహాలో స్ట్రీమింగ్ కానుంది. ఇందులో నయనతార- కుంచాకో బోబన్ ప్రధాన పాత్రలో నటించగా.. అప్పు ఎన్.భట్టతిరై దర్శకత్వం వహించారు. జోసెఫ్- అభిజీత్ పిళ్లై సంయుక్తంగా నిర్మించారు. `ట్రూ లైస్` అనేది ఈ సినిమా ఉపశీర్షిక. ఎస్. కురుప్ సంగీతం అందించారు. నీడ జూలై 23న ఆహాలో వరల్డ్ ప్రీమియర్ కి సిద్ధమవుతోంది.
తమిళంలో విజయం సాధించిన ఈ చిత్రం తెలుగు ఆడియెన్ ని థ్రిల్ కి గురి చేస్తుందని ఆహా వర్గాలు చెబుతున్నాయి. నితిన్ అనే చిన్నారి సాయంతో జాన్ అనే న్యాయమూర్తి ఒక హత్య కేసును ఛేదించే నేపథ్యంలో ఎలాంటి నిజాలు బయటపడ్డాయి? అన్నదే ఈ సినిమా కథాంశం. ఆద్యంతం ఉత్కంఠకు గురి చేస్తుంది.
విజయ్ సేతుపతి - విక్రమార్కుడు.. బిగ్ బాస్ ఫేం పునర్నవి భూపాలం నటించిన ఒక చిన్న విరామం ఆహాలో నేటి (9జూలై) నుంచి స్ట్రీమింగ్ కానున్నాయి. అలాగే అజయ్ దేవగన్ -సోనాక్షి సిన్హా వంటి తారలు నటించిన `భుజ్ - ది ప్రైడ్ ఆఫ్ ఇండియా` ఆగస్టు 13 నుంచి స్ట్రీమింగ్ కానుంది.