Begin typing your search above and press return to search.

మారాల్సింది మా బ‌ట్ట‌లు కాదు..మీ బుద్ధిః అమితాబ్ మ‌న‌వ‌రాలు బూతు రిప్లే!

By:  Tupaki Desk   |   18 March 2021 9:42 AM GMT
మారాల్సింది మా బ‌ట్ట‌లు కాదు..మీ బుద్ధిః అమితాబ్ మ‌న‌వ‌రాలు బూతు రిప్లే!
X
మ‌హిళ‌ల వ‌స్త్రధార‌ణ‌పై వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేసిన ఉత్త‌రాఖండ్ నూత‌న ముఖ్య‌మంత్రి తీర‌థ్ సింగ్ రావ‌త్ పై.. తీవ్ర‌స్థాయిలో స్పందించింది బాలీవుడ్ మెగాస్టార్ అమితాబ్ బ‌చ్చ‌న్ మ‌న‌వ‌రాలు. మారాల్సింది మా వ‌స్త్ర‌ధార‌ణ కాదు.. మీ బుద్ధి మారాలంటూ ఘాటుగా కౌంట‌ర్ ఇచ్చింది. ప్ర‌స్తుతం వ్యాఖ్య‌లు సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అవుతున్నాయి.

ఉత్త‌రాఖండ్ సీఎం తీర‌థ్ సింగ్ ఇటీవ‌ల ఓ స‌మావేశంలో మాట్లాడుతూ.. యువ‌తులు వేసుకునే దుస్తుల‌పై వివాదాస్ప‌ద వ్యాఖ్య‌లు చేశారు. అమ్మాయిలు టాన్ జీన్స్‌, రిఫ్డ్ జీన్స్ వంటివి వేసుకోవ‌ద్ద‌న్నారు. ఇలాంటి వాటివ‌ల్ల సంప్ర‌దాయం మంట గ‌లిసిపోతోంద‌ని అన్నారు.

అంతేకాదు.. త‌ల్లిదండ్రుల‌ను కూడా ఆయ‌న టార్గెట్ చేసి మాట్లాడారు. ఇంట్లో పిల్ల‌ల‌కు ఏం నేర్పుతున్నారు? స‌మాజానికి ఏం సందేశం ఇస్తున్నారంటూ? వ్యాఖ్యానించారు. మనం ఎలా ప్రవర్తిస్తే.. పిల్లలు కూడా పెద్దయ్యాక అలాగే తయారవుతారని అన్నారు. వెస్ట్రన్ పిచ్చిలో మనం మన సంస్కృతిని మ‌రిచిపోతున్నామ‌ని చెప్పుకొచ్చారు ముఖ్య‌మంత్రి.

ఆయ‌న వ్యాఖ్య‌ల‌పై అమితాబ్ బ‌చ్చ‌న్ మ‌న‌వ‌రాలు న‌వ్యా న‌వేలి ఘాటుగా స్పందించారు. మ‌హిళ‌లు వేసుకునే దుస్తుల‌ను బ‌ట్టి వారిని అంచ‌నా వేయ‌డంపై మండిప‌డ్డారు. ‘వాట్ ద ఫ**’ అంటూ.. ఫైర్ అయ్యారు. ‘మేం ఎలాంటి దుస్తులు వేసుకోవాలో చెప్పడానికి ముందు.. మీ మనస్తత్వాన్ని మార్చుకోండి’ అంటూ ఆగ్రహం వ్యక్తంచేశారు.

అంతేకాదు.. ‘నేను గర్వంగా నా రిప్డ్ జీన్స్ వేసుకుంటాను’ అంటూ సోషల్ మీడియా వేదికగా కామెంట్ చేసిన నవ్యా.. తాను చిరిగిన జీన్స్ ధరించిన ఉన్న ఓ ఫొటోను కూడా షేర్ చేశారు. ప్ర‌స్తుతం ఈ పోస్టు వైర‌ల్ అవుతోంది.