Begin typing your search above and press return to search.
శ్రీ రెడ్డి ప్రొడక్షన్స్ ఆఫర్ కావాలా?
By: Tupaki Desk | 23 Dec 2019 4:56 PM ISTమూవీ ఆర్టిస్టుల సంఘం (మా) పరువు మర్యాదల్ని మంట కలిపిన వివాదాస్పద నటిగా శ్రీ రెడ్డి పేరు హిస్టరీకెక్కింది. మా పెద్దల నిర్వాకంపై సినీ పెద్దలంతా మండి పడిన సంగతిని మర్చిపోలేం. అయితే ఎవరు ఎలా పోయినా శ్రీ రెడ్డి కి మాత్రం సోషల్ మీడియాలో ఏకంగా 70లక్షల మంది ఫాలోవర్స్ ఏర్పడ్డారు. ప్రస్తుతం ఈ భామ సామాజిక సేవకు ఉపక్రమించింది. ఇకపై సోషల్ సేవ చేస్తూనే సినీపరిశ్రమ ప్రతిభను ఎంకరేజ్ చేస్తుందట.
త్వరలోనే శ్రీ రెడ్డి ప్రొడక్షన్స్ పేరు తో నిర్మాణ సంస్థ ప్రారంభించబోతున్నానని శ్రీరెడ్డి ప్రకటించింది. సినీ పరిశ్రమలో అవకాశాలు దొరక్క కష్టపడుతున్న కొత్త వారి కోసమే ఈ ప్రయత్నం అని వెల్లడించింది. అయితే ఎలాంటి వారిని ఎంపిక చేసుకుంటారు? అని ప్రశ్నిస్తే.. తొలి ఛాన్స్ తమిళనాడు ట్యాలెంటుకేనట. ఆ తర్వాత తెలుగు వారి గురించి ఆలోచిస్తానని నిష్కల్మషంగా చెప్పేసింది. నేను సినిమా అవకాశాల కోసమే కాదు షార్ట్ ఫిలింస్ కోసం కూడా చాలా కష్టపడ్డాను. నాలాంటి బాధలు ఎవరూ పడకూడదన్నదే నా ఉద్ధేశం`` అని తెలిపింది శ్రీరెడ్డి.
పెళ్లెప్పుడు? అన్నదానిపైనా శ్రీరెడ్డి స్పందించింది. నాకు జీవితంలో పెళ్లి ఆలోచన లేదు. నేను సన్యాసిని తరహా. జీవితంలో జరిగిన ఘోరమైన అవమానాల వల్లనే ప్రేమ- పెళ్లి అనేవి ఆలోచించ లేదని తెలిపింది. ఒక సన్యాసిని.. సామాజిక కర్తగా శ్రీరెడ్డి తనని తాను నిరూపించుకునే పనిలో ఉన్నారన్నమాట!!