Begin typing your search above and press return to search.

కరణ్ జోహర్ కంపెనీ ఎగ్జిక్యూటివ్ ఇంట్లో గంజాయి స్వాధీనం.. క్షితిజ్ ని అదుపులోకి తీసుకున్న NCB...!

By:  Tupaki Desk   |   25 Sept 2020 4:20 PM IST
కరణ్ జోహర్ కంపెనీ ఎగ్జిక్యూటివ్ ఇంట్లో గంజాయి స్వాధీనం.. క్షితిజ్ ని అదుపులోకి తీసుకున్న NCB...!
X
బాలీవుడ్ డ్రగ్ వ్యవహారంలో ప్రముఖ దర్శక నిర్మాత కరణ్ జోహార్ కు చెందిన ధర్మ ప్రొడక్షన్ కంపెనీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ క్షతిజ్ రవి ప్రసాద్ నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు సమన్లు జారీ చేసిన సంగతి తెలిసిందే. ఈ రోజు (సెప్టెంబర్ 24) ఎన్సీబీ ఆఫీస్ లో హాజరవ్వాలని నోటీసులో పేర్కొన్నారు. ఈ క్రమంలో నిన్న (గురువారం) క్షితిజ్ రవి ప్రసాద్‌ నివాసంలో ఎన్సీబీ అధికారులు సోదాలు చేశారని నేషనల్ మీడియాలో వార్తలు వచ్చాయి. ఈ దాడులలో క్షితిజ్ రవి ప్రసాద్ ఇంట్లో గంజాయి మరియు చిన్న మొత్తంలో వీడ్ ని స్వాధీనం చేసుకున్నారని తెలుస్తోంది. అంతేకాకుండా క్షితిజ్ రెగ్యులర్ గా డ్రగ్స్ తీసుకుంటాడని గుర్తించిన అధికారులు.. అతన్ని అదుపులోకి తీసుకొని ఎన్సీబీ ఆఫీస్ కు తరలించారు. ఢిల్లీ నుంచి ముంబైకి వచ్చిన కొన్ని గంటల్లోనే క్షితిజ్ ని అదుపులోకి తీసుకున్నారు.

కాగా, ఈ రోజు విచారణకు ఎన్సీబీ పిలవడంతో ధర్మ ప్రొడక్షన్ కంపెనీ ఎగ్జిక్యూటివ్ ప్రొడ్యూసర్ ఢిల్లీ నుంచి వచ్చినట్లు తెలుస్తోంది. ఎన్సీబీ ఆఫీస్ కు క్షితిజ్ ని తీసుకొచ్చిన అధికారులు.. అతన్ని విచారించిన తర్వాత అదుపులోకి తీసుకుంటారని సమాచారం. గత కొన్ని రోజులుగా నార్కోటిక్స్ కంట్రోల్ బ్యూరో అధికారులు గోవా మరియు ముంబైలో దాడులు చేసి పలువురు డ్రగ్ డీలర్స్ ని విచారించగా ప్రముఖుల పేర్లు బయటకు వస్తున్నట్లు తెలుస్తోంది. ఈ క్రమంలో డ్రగ్ పెడ్లర్ అంకుష్ అర్నెజా విచారించగా.. క్షితిజ్ తన నుండి డ్రగ్స్ కొనుగోలు చేసాడని అంగీకరించినట్లు వార్తలు వస్తున్నాయి. అతని సమాచారం మేరకే క్షితిజ్ కి డ్రగ్స్ కేసులో నోటీసులు పంపించారని తెలుస్తోంది.