Begin typing your search above and press return to search.

#NBK108 టైటిల్ డైల‌మా ఇంకెన్నాళ్లు?

By:  Tupaki Desk   |   15 July 2022 2:30 AM GMT
#NBK108 టైటిల్ డైల‌మా ఇంకెన్నాళ్లు?
X
జ‌నాన్ని థియేట‌ర్ల‌కు లాక్కొచ్చేదే టైటిల్. మంచి టైటిల్ తో స‌గం విజ‌యం ద‌క్కిన‌ట్టే. అందుకే హీరోలు ద‌ర్శ‌క‌నిర్మాత‌లు సినిమాల‌ టైటిల్ విష‌యంలో ఆచితూచి ఎంపిక చేస్తారు.

మెగా కాంపౌండ్ అయినా నంద‌మూరి కాంపౌండ్ ..అక్కినేని కాంపౌండ్.. ద‌గ్గుబాటి కాంపౌండ్ ఇలా ఎవ‌రైనా కానీ టైటిల్ విష‌యంలో రాజీకి రాకుండా మంచి ఎంపిక కోసం వేచి చూస్తారు.

ఇటీవ‌ల నట‌సింహా నంద‌మూరి బాల‌కృష్ణ అనీల్ రావిపూడితో త‌న సినిమాకి మంచి టైటిల్ కోసం వేచి చూస్తున్నారు. కానీ కుద‌ర‌డం ఏదు. అనీల్ రావిపూడి ఈ క్రేజీ మూవీ టైటిల్ కోసం చాలానే త‌పిస్తున్నారు.

ఇంత‌కుముందు `రామారావు గారు!` అనే టైటిల్ ని రావిపూడి సూచిస్తే అదే టైటిల్ తో ర‌వితేజ సినిమా చేస్తున్నందున వ‌ద్దనుకున్నార‌ట‌.

ఆ త‌ర్వాత `బ్రో! ఐ డోంట్ కేర్` అనే టైటిల్ ని సూచించ‌గా.. బాల‌య్యకు ఇది న‌చ్చ‌లేద‌ట‌. మ‌రో టైటిల్ ని వెత‌క‌మ‌ని కూడా ద‌ర్శ‌కుడికి సూచించిన‌ట్టు తెలుస్తోంది.

గోపిచంద్ మ‌లినేనితో కెరీర్ 107వ సినిమా చేస్తున్న బాల‌కృష్ణ త‌దుప‌రి అనీల్ రావిపూడితో ఎన్.బి.కె 108 మూవీ చేయ‌నున్నారు. ప్ర‌స్తుతం టైటిల్ డైల‌మా కొన‌సాగుతోంది. రావిపూడి ఏదో ఒక‌టి ఫైన‌ల్ చేయాల్సి ఉంటుంది.