Begin typing your search above and press return to search.

NBK108 : ఫ్యాన్స్ ను నిరాశపరచిన రావిపూడి

By:  Tupaki Desk   |   10 Jun 2022 9:38 AM GMT
NBK108 : ఫ్యాన్స్ ను నిరాశపరచిన రావిపూడి
X
నేడు నందమూరి బాలకృష్ణ పుట్టిన రోజు సందర్బంగా గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న ఎన్‌బీకే 107 సినిమా నుండి ఫస్ట్‌ హంట్‌ అంటూ పవర్ ఫుల్ వీడియో టీజర్ వచ్చిన విషయం తెల్సిందే. ఆ టీజర్ లో బాలయ్య డైలాగ్స్ అదిరిపోయాయి అంటూ టాక్‌ వచ్చింది. సినిమా లో బాలయ్య ను ఏ రేంజ్ లో చూడబోతున్నామో ఆ వీడియో లోనే దర్శకుడు గోపీచంద్‌ మలినేని చెప్పకనే చెప్పాడు.

హీరోగా బాలయ్య తదుపరి సినిమా అనిల్ రావిపూడి దర్శకత్వంలో అంటూ కొన్ని నెలల క్రితమే కన్ఫర్మ్‌ అయ్యింది. కనుక బాలయ్య 108 అప్డేట్ ను నేడు పుట్టిన రోజు సందర్భంగా ఇచ్చే అవకాశం ఉందని అంతా భావించారు. మొన్నటి వరకు అనిల్ ఒక టైటిల్‌ ను కూడా అనుకున్నాడు.. ఆ టైటిల్‌ తో పోస్టర్ ను లేదా ఒక ప్రీ లుక్ ను టైటిల్‌ తో బర్త్‌ డే సందర్బంగా విడుదల చేసే అవకాశం ఉందని అంతా భావించారు.

కాని అసలు విషయం ఏంటిఅంటే ఇప్పటి వరకు వీరిద్దరి కాంబోలో సినిమా కన్ఫర్మ్‌ అయ్యింది కాని అంతకు మించి ఏ ఒక్క విషయంలోనూ అడుగు ముందుకు పడలేదు. నేడు బాలయ్య బర్త్‌ డే సందర్బంగా అనిల్ రావిపూడి ఒక పోస్ట్‌ పెట్టాడు. ఫోటో తో పాటు బాలయ్య తో సినిమా చేయబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించాడు. కాని అందులో ఎలాంటి విషయాలను క్లారిటీ ఇవ్వలేదు.

ముఖ్యంగా అనిల్ రావిపూడి.. బాలయ్య కాంబోలో రూపొందబోతున్న సినిమాను నిర్మించబోతున్నది ఎవరు అనే విషయం ఇప్పటి వరకు స్పష్టత లేదు. అందుకే పోస్టర్‌ లో ఆ సినిమా నిర్మాతలు ఎవరు అనే విషయంలో పేర్కొనలేదు. అనిల్ వరుస సక్సెస్‌ లతో జోరు మీదున్నాడు. కనుక ఆయనతో సినిమాను నిర్మించేందుకు ఎవరైనా ముందుకు వస్తారు.

బాలయ్య కూడా అఖండ సినిమా తో మంచి విజయాన్ని సొంతం చేసుకుని సక్సెస్ ట్రాక్ లో ఉన్నాడు. కనుక వీరిద్దరి కాంబో సినిమా ను నిర్మించేందుకు పెద్ద నిర్మాతలు మాత్రమే కాకుండా చిన్న నిర్మాతలు కూడా ఇంట్రెస్ట్ గా ఉండే అవకాశం ఉంది. కాని ఇప్పటి వరకు అనిల్‌ మాత్రం ఏ బ్యానర్ లో ఈ సినిమాను చేయబోతున్నాడు అనే విషయమై క్లారిటీ ఇవ్వలేదు.

బర్త్‌ డే సందర్బంగా అయినా ఆ విషయాన్ని క్లారిటీ ఇచ్చి టైటిల్‌ ను లేదా ఏదో ఒక కాన్సెప్ట్‌ పోస్టర్ ను అనిల్‌ విడుదల చేసి ఉంటే బాగుండేది అంటూ నందమూరి అభిమానులు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. సోషల్‌ మీడియాలో బాలయ్య 108 సినిమా గురించి జోరుగా ట్రెండ్‌ అవుతుందని భావిస్తే చడి చప్పుడు లేకుండా చేశాడు అనిల్ రావిపూడి.