Begin typing your search above and press return to search.

NBK107 ఆన్ లొకేషన్‌.. బాలయ్య పాతికేళ్లు తగ్గాడుగా!

By:  Tupaki Desk   |   30 Aug 2022 1:23 PM GMT
NBK107 ఆన్ లొకేషన్‌.. బాలయ్య పాతికేళ్లు తగ్గాడుగా!
X
నందమూరి బాలకృష్ణ 107వ సినిమా ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో రూపొందుతున్న విషయం తెల్సిందే. ఆ సినిమాకు సంబంధించిన చివరి దశ షూటింగ్ మొదలు అయ్యింది.

మొన్నటి వరకు సినిమా నిర్మాతల యొక్క బంద్‌ కారణంగా షూటింగ్ ను ఆపేసిన దర్శకుడు గోపీచంద్ మలినేని తాజాగా మళ్లీ మొదలు పెట్టాడు. ప్రస్తుతం శృతి హాసన్ మరియు బాలయ్య లపై చిత్రీకరణ జరుపుతున్నాడు.

అందుకు సంబంధించిన ఈ ఫోటోను దర్శకుడు గోపీచంద్‌ మలినేని షేర్ చేశాడు. ఈ ఫోటోలో బాలయ్య లుక్‌ అదిరి పోయిందంటూ అభిమానులు కామెంట్స్ చేస్తున్నారు. బాలయ్య వయసు పాతిక సంవత్సరాలు తగ్గినట్లుగా అనిపిస్తుందని.. ఆయన మేకోవర్ మరియు కాస్ట్యూమ్స్ స్టైలింగ్‌ అదిరి పోయిందంటూ నెటిజన్స్ కూడా అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

బాలయ్య ఆరు పదుల వయసులో కూడా మాస్ సినిమాల్లో కుమ్మేస్తూ వరుసగా సక్సెస్ లను దక్కించుకుంటున్నాడు అంటూ అభిమానులు ఈ ఫోటో ను తెగ షేర్‌ చేస్తున్నారు. అఖండ విజయం తర్వాత బాలయ్య నుండి వస్తున్న సినిమా అంటే సహజంగానే అంచనాలు ఆకాశాన్ని తాకేలా ఉన్నాయి. అంచనాలకు ఏమాత్రం తగ్గకుండా దర్శకుడు ఈ సినిమా ను రూపొందిస్తున్నాడు.

ఈ సినిమా లో బాలకృష్ణ కు జోడీగా శృతి హాసన్‌ నటిస్తోంది. ఇంకా ఈ సినిమా లో తమిళ స్టార్‌ నటి కూడా నటిస్తున్నట్లుగా సమాచారం అందుతోంది. మొత్తానికి ఈ సినిమా బాలయ్య కెరీర్‌ లో ఒక మాస్‌ బ్లాక్ బస్టర్ గా నిలుస్తుంది అంటూ ఇండస్ట్రీ వర్గాల వారు మరియు యూనిట్‌ సభ్యులు నమ్మకంతో ఉన్నారు. ఈ సినిమా తర్వాత బాలయ్య అనిల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా చేయబోతున్న విషయం తెల్సిందే.

నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.