Begin typing your search above and press return to search.

బాలయ్య అభిమానులకు ఊరట.. ఇక టెన్షన్‌ అక్కర్లేదు

By:  Tupaki Desk   |   26 Feb 2022 7:30 AM GMT
బాలయ్య అభిమానులకు ఊరట.. ఇక టెన్షన్‌ అక్కర్లేదు
X
బాలకృష్ణ 'అఖండ' సినిమా తో భారీ విజయాన్ని సొంతం చేసుకున్నాడు. ఎప్పుడు లేని విధంగా ఏకంగా రెండు వందల కోట్ల వసూళ్లను అఖండ దక్కించుకోవడం మాత్రమే కాకుండా అత్యధికంగా 50 రోజులు ఎక్కువ థియేటర్లలో ఆడిన సినిమాగా కూడా అఖండ సినిమా నిలిచింది. అఖండ సినిమా లో బాలయ్య ద్విపాత్రాభినయం తో అదరగొట్టేశాడు. రెండు పాత్రల్లో కూడా బాలయ్య నటనకు మంచి మార్కులు పడ్డాయి.

ఇప్పుడు బాలయ్య చేస్తున్న సినిమా గురించి ప్రముఖంగా చర్చ జరుగుతోంది. అఖండ సినిమా ఘన విజయం సాధించిన కారణంగా ప్రస్తుతం బాలయ్య తో సినిమాను తెరకెక్కిస్తున్న గోపీచంద్‌ మలినేనిపై విపరీతమైన ఒత్తిడి పడుతోంది. విశ్వసనీయంగా అందుతున్న సమాచారం ప్రకారం ఈ సినిమాలో కూడా బాలయ్య ద్విపాత్రాభినయం చేయబోతున్నాడట. తండ్రి కొడుకులుగా బాలయ్య కనిపిస్తాడని అంటున్నారు.

ఇటీవల ఫస్ట్‌ లుక్‌ ను రివీల్‌ చేశారు. సినిమా టైటిల్‌ ను రివీల్‌ చేస్తారని అంతా భావిస్తున్న సమయంలో అనూహ్యంగా కేవలం ఫస్ట్‌ లుక్ ను మాత్రమే రివీల్‌ చేయడం ద్వారా అభిమానులు ఒకింత నిరుత్సాహం వ్యక్తం చేస్తున్నారు. ఈ సమయంలో సినిమా ఫస్ట్‌ లుక్‌ కొన్ని కొత్త అనుమానాలకు తెర తీశాయి. ముఖ్యంగా ఈ సినిమా కన్నడంలో ఇంతకు ముందు వచ్చిన శివ రాజ్ కుమార్‌ నటించిన 'మఫ్టీ' సినిమాకు మక్కీకి మక్కీనా అనే చర్చ మొదలు అయ్యింది.

మఫ్టీ సినిమాకు కాపీ అయినా అయ్యి ఉండాలి లేదంటే ఆ సినిమా నుండి ఇన్సిఫైర్‌ అయ్యి అయినా ఉండాలి అంటూ చర్చ మొదలు అయ్యింది. ఎందుకంటే బాలయ్య లుక్ మరియు మఫ్టీ లో శివరాజ్ కుమార్‌ లుక్‌ సేమ్‌ టు సేమ్‌ ఉన్నట్లుగా కొందరు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. కాని అసలు విషయం ఏంటీ అనేది చిత్ర యూనిట్‌ సభ్యులు చెప్పాలంటూ అభిమానులు డిమాండ్‌ చేశారు.

ఎట్టకేలకు బాలయ్య 107 సినిమా మేకర్స్ పుకార్లకు చెక్‌ పెట్టారు. ఇది ఏ ఒక్క సినిమాకు కాపీ కాదు.. రీ మేక్‌ కాదని తేల్చి చెప్పారు. ఇది తెలుగు రాష్ట్రంలో జరిగిన కొన్ని యాదార్థ సంఘటనలు మరియు రియల్‌ పాత్రలను తీసుకుని కల్పిత కథతో రూపొందిస్తున్న సినిమా అంటూ అధికారికంగా ప్రకటించారు. బాలయ్య సినిమా విషయంలో ఇకపై ఇలాంటి పుకార్లు ఆపేయాలంటూ అభిమానులు కూడా విజ్ఞప్తి చేస్తున్నారు.

పల్నాటి ప్రాంతంకు చెందిన ఒక వ్యక్తి గురించి దర్శకుడు గోపీచంద్‌ మలినేని ఎంతో రీసెర్చ్ చేసిన తర్వాత ఈ కథను సిద్ధం చేయడం జరిగింది. ఆ కథ ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది అంటూ యూనిట్‌ సభ్యులు చెబుతున్నారు. ఇదే ఏడాది ద్వితీయార్థంలో ఈ సినిమా విడుదల అయ్యే అవకాశాలు ఉన్నాయి. ఆ వెంటనే అనీల్‌ రావిపూడి దర్శకత్వంలో ఒక సినిమా ను బాలయ్య చేసేందుకు ఇప్పటికే ఓకే చెప్పిన విషయం తెల్సిందే.