Begin typing your search above and press return to search.

#NBK107: పవర్ ఫుల్ రోల్ లో 'క్రాక్' జయమ్మ..!

By:  Tupaki Desk   |   11 Jun 2021 7:30 AM GMT
#NBK107: పవర్ ఫుల్ రోల్ లో క్రాక్ జయమ్మ..!
X
నటసింహం నందమూరి బాలకృష్ణ - డైరెక్టర్ గోపీచంద్ మలినేని కాంబినేషన్ లో ఓ సినిమా తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. నిన్న గురువారం బాలయ్య పుట్టినరోజు సందర్భంగా '#NBK107' సంబంధించిన అధికారిక ప్రకటన కూడా వచ్చేసింది. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ పై నవీన్ ఎర్నేని - వై.రవిశంకర్ కలసి ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. 'క్రాక్' వంటి బ్లాక్ బస్టర్ హిట్ తో జోష్ మీదున్న గోపీచంద్ మలినేని వాస్తవ సంఘటన ఆధారంగా ఓ పవర్ ఫుల్ స్టోరీ రెడీ చేసినట్లు తెలుస్తోంది. ఈ క్రేజీ ప్రాజెక్ట్ కోసం అగ్రశ్రేణి సాంకేతిక బృందం మరియు స్టార్ క్యాస్టింగ్ వర్క్ చేయనున్నారు. ఇప్పటికే ఎస్.ఎస్. థమన్ ఈ చిత్రానికి సంగీతం సమకూర్చనున్నట్లు వెల్లడించారు. ఈ క్రమంలో టాలెంటెడ్ యాక్ట్రెస్ వరలక్ష్మీ శరత్ కుమార్ బాలయ్య సినిమాలో నటించనున్నట్లు మేకర్స్ తెలిపారు.

కోలీవుడ్ హీరోయిన్ వరలక్ష్మీ శరత్ కుమార్ ఓవైపు నెగిటివ్ రోల్స్ మరోవైపు పాజిటివ్ రోల్స్ చేస్తూ ఆడియన్స్ ని మెప్పిస్తోంది. టాలీవుడ్ లో క్రేజీ ఆఫర్స్ అందుకుంటున్న వరు.. గోపీచంద్ మలినేని గత చిత్రం 'క్రాక్' లో జయమ్మగా అద్భుతమైన నటన కనబరిచింది. ఆమె కెరీర్ లోనే గుర్తుండి పోయే రోల్ ఇచ్చిన మాస్ డైరెక్టర్.. ఇప్పుడు '#NBK107' లో కూడా ఓ పాత్రను క్రియేట్ చేసినట్లు తెలుస్తోంది. బాలకృష్ణ వంటి స్టార్ హీరోతో స్క్రీన్ షేర్ చేసుకోబోతున్న వరలక్ష్మి.. మరోసారి తన అసాధారణ నటనతో ప్రశంసలు అందుకోనుందని చెప్పవచ్చు. ప్రస్తుతం ప్రీ ప్రొడక్షన్ వర్క్స్ జరుపుకుంటున్న ఈ చిత్రాన్ని త్వరలోనే సెట్స్ పైకి తీసుకెళ్లనున్నారు. ఇందులో నటించే ఇతర నటీనటులు సాంకేతిక నిపుణుల వివరాలు త్వరలోనే వెల్లడికానున్నాయి.