Begin typing your search above and press return to search.

NBK107 ఫస్ట్ లుక్: వేటకు బయల్దేరిన సింహంలా నటసింహం..!

By:  Tupaki Desk   |   21 Feb 2022 11:37 AM GMT
NBK107 ఫస్ట్ లుక్: వేటకు బయల్దేరిన సింహంలా నటసింహం..!
X
నటసింహం నందమూరి బాలకృష్ణ - డైరెక్టర్ గోపీచంద్‌ మలినేని కాంబినేషన్ లో ఓ భారీ చిత్రం తెరకెక్కనున్న సంగతి తెలిసిందే. ఇది బాలయ్య కెరీర్ లో 107వ సినిమా. వాస్తవ సంఘటనల ఆధారంగా పక్కా మాస్‌ అండ్ యాక్షన్‌ ఎంటర్‌టైనర్‌ గా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారు. ఇటీవలే ఈ సినిమా రెగ్యులర్ షూటింగ్ ప్రారంభమైంది. ఈ నేపథ్యంలో తాజాగా NBK107 ఫస్ట్ లుక్ ని మేకర్స్ రిలీజ్ చేశారు.

#NBK107 సినిమా ఫస్ట్ డే షూటింగ్ సందర్భంగా బాలకృష్ణ ఫోటో లీక్ కాబడి, సోషల్ మీడియాలో వైరల్ అయిన సంగతి తెలిసిందే. దీంతో సినిమాలో బాలయ్య లుక్‌ కి సంబంధించిన పోస్టర్‌ ను మేకర్స్ అధికారికంగా విడుదల చేసారు. ఇందులో నటసింహం మైనింగ్ ఏరియాలో నల్ల కళ్ళద్దాలు పెట్టుకొని స్టైలిష్‌ గా ఇంటెన్స్ గా నడుచుకుంటూ వస్తున్నారు. పంచె కట్టులో బ్లాక్ షర్ట్ ధరించి విభిన్నమైన గెటప్‌ లో పవర్‌ ఫుల్ గా కనిపిస్తున్నారు.

నెరిసిన జుట్టు - తెల్లటి గడ్డం - నుదుటన బొట్టు - ఒక చేతికి వాచ్ - మరో చేతికి రుద్రాక్ష మాల ధరించి బాలయ్య కాస్త వయసు మీదపడిన వ్యక్తిలా ఉన్నారు. బ్యాగ్రౌండ్ లో ల్యాండ్ రోవర్ డిఫెండర్ కారును కూడా గమనించవచ్చు. ఈ హై ఇంటెన్స్ యాక్షన్ ఎంటర్‌టైనర్‌ లో బాలకృష్ణ ఎంత పవర్‌ ఫుల్ క్యారెక్టర్‌ని పోషిస్తున్నాడో ఈ గెటప్ ని బట్టి అర్థం అవుతోంది. ఈ లుక్ నందమూరి అభిమానులు విపరీతంగా ఆకట్టుకుంటోంది.

వేటకు బయల్దేరిన సింహంలా నటసింహం కనిపిస్తున్నాడని కామెంట్స్ చేస్తున్నారు. బోయపాటి శ్రీను తరహాలోనే గోపీచంద్ మలినేని కూడా బాలయ్యను మునుపెన్నడూ చూడని పాత్రలో ప్రెజెంట్ చేయబోతున్నారని ధీమా వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం జరుగుతున్న #NBK107 షెడ్యూల్ లో ఫైట్స్ మాస్టర్స్ రామ్ లక్ష్మణ్ పర్యవేక్షణలో బాలయ్య పాల్గొనే యాక్షన్ సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు.

ఇందులో బాలకృష్ణ ద్విపాత్రిభినయం చేస్తున్నారని టాక్. శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తుండగా.. వరలక్ష్మి శరత్ కుమార్ కీలక పాత్ర పోషించనున్నారు. మైత్రీ మూవీ మేకర్స్‌ పతాకంపై నవీన్‌ ఎర్నేని - వై.రవిశంకర్‌ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. ఎస్ఎస్ థమన్ సంగీతం సమకూరుస్తున్న ఈ చిత్రానికి సాయి మాధవ్‌ బుర్రా సంభాషణలు అందిస్తున్నారు. రిషి పంజాబీ సినిమాటోగ్రఫి నిరవహిస్తున్నారు. 'అఖండ' - 'క్రాక్' వంటి బ్లాక్ బస్టర్స్ తో జోష్ లో ఉన్న బాలకృష్ణ - గోపీచంద్ మలినేని కాంబోలో రాబోతున్న ఈ సినిమాపై భారీ అంచనాలు నెలకొన్నాయి.