Begin typing your search above and press return to search.

ఎన్‌బికే 107 ఫస్ట్‌ హంట్ లోడింగ్‌..!

By:  Tupaki Desk   |   7 Jun 2022 4:51 AM GMT
ఎన్‌బికే 107 ఫస్ట్‌ హంట్ లోడింగ్‌..!
X
అఖండ విజయాన్ని సొంతం చేసుకున్న బాలకృష్ణ ప్రస్తుతం గోపీచంద్ మలినేని దర్శకత్వంలో సినిమా చేస్తున్న విషయం తెల్సిందే. అఖండ కు ఏమాత్రం తగ్గకుండా బాలయ్య 107 సినిమా ఉండబోతుంది అంటూ వార్తలు వస్తున్నాయి. గోపీచంద్‌ మలినేని గత చిత్రం మంచి విజయాన్ని సొంతం చేసుకున్న నేపథ్యంలో ఈ సినిమా పై అంచనాలు ఆకాశమే హద్దు అన్నట్లుగా ఉన్నాయి.

ఇప్పటికే బాలయ్య లుక్ ను రివీల్ చేశారు. ఇటీవల ఎన్టీఆర్‌100వ జయంతి సందర్బంగా టైటిల్‌ ను రివీల్‌ చేయబోతున్నట్లుగా వార్తలు వచ్చాయి. కాని ఆ సమయంలో మరో పోస్టర్ ను మాత్రమే విడుదల చేసి టైటిల్‌ ను సస్పెన్స్ లో ఉంచారు. బాలయ్య పుట్టిన రోజు రాబోతున్న నేపథ్యంలో మరో ఇంట్రెస్టింగ్‌ అప్డేట్ ను చిత్ర యూనిట్‌ సభ్యులు వదలబోతున్నట్లుగా అధికారికంగా ప్రకటించారు.

ఎన్‌బికే 107 ఫస్ట్‌ హంట్ లోండింగ్ అంటూ ఈ పోస్టర్ ను షేర్‌ చేశారు. ఒకటి రెండు రోజుల్లో ఫస్ట్‌ హంట్ ఏంటీ అనే విషయంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.

బాలయ్య గెటప్ చూస్తుంటే అభిమానులకు పూనకాలు వస్తున్నాయి. భారీ అంచనాల నడుమ రూపొందుతున్న ఈ సినిమాకు పలు టైటిల్స్ ను పరిశీలిస్తున్నారు. అందులో ప్రధానంగా జై బాలయ్య ఉన్నట్లుగా తెలుస్తోంది.

జై బాలయ్య టైటిల్‌ విషయంలో త్వరలోనే ఒక క్లారిటీ వస్తుందని అంతా ఆశిస్తున్నారు. ఈ సినిమా లో బాలయ్య కు జోడీగా శృతి హాసన్ నటిస్తున్న విషయం తెల్సిందే. బాలకృష్ణ 107 సినిమా అన్ని అనుకున్నట్లుగా జరిగితే ఇదే ఏడాదిలో ప్రేక్షకుల ముందుకు వచ్చే అవకాశాలు ఉన్నాయంటూ యూనిట్‌ సభ్యులు నమ్మకంగా చెబుతున్నారు.

అఖండ సినిమా తో విజయాన్ని సొంతం చేసుకున్న బాలయ్యతో అదే స్థాయిలో గోపీచంద్‌ మలినేని మాస్ ఎంటర్‌ టైన్మెంట్‌ ను ఇవ్వబోతున్నాడు. మరో వైపు అనిల్‌ రావిపూడి కూడా బాలయ్య 108 సినిమాకు సిద్దం అవుతున్నాడు. అనిల్ రావిపూడికి కలిసి వచ్చే సంక్రాంతి సీజన్ లో బాలయ్య 108 సినిమాను ప్రేక్షకుల ముందుకు తీసుకు వచ్చే అవకాశాలు ఉన్నాయి.