Begin typing your search above and press return to search.

#NBK107 క‌థానాయిక ఎవ‌రో తెలిస్తే షాకింగే

By:  Tupaki Desk   |   22 May 2021 5:02 PM IST
#NBK107 క‌థానాయిక ఎవ‌రో తెలిస్తే షాకింగే
X
న‌ట‌సింహా నంద‌మూరి బాల‌కృష్ణ ప్ర‌స్తుతం బోయ‌పాటి శ్రీ‌ను ద‌ర్శ‌క‌త్వంలో న‌టిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ సినిమాతో పాటు గోపిచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమాకి క‌మిట‌య్యారు. క్రాక్ లాంటి బ్లాక్ బ‌స్ట‌ర్ మూవీని తెర‌కెక్కించిన గోపిచంద్ మ‌లినేని ఆ వెంట‌నే బాల‌య్య సినిమాని ప్రారంభించారు.

ప్ర‌స్తుతం ప్రీప్రొడ‌క్ష‌న్ ప‌నులు పూర్త‌వుతున్నాయి. అలాగే క‌థానాయికను సంగీత ద‌ర్శ‌కుడిని కూడా ఫైన‌ల్ చేసేశార‌ని తెలుస్తోంది. తాజా స‌మాచారం మేర‌కు ఈ చిత్రానికి ఎస్.ఎస్.థ‌మ‌న్ సంగీతం అందిస్తారు. అల వైకుంఠ‌పుర‌ములో చార్ట్ బ‌స్ట‌ర్ సాంగ్స్ తో థ‌మ‌న్ పేరు మార్మోగింది. ప్ర‌స్తుతం మ‌హేష్- ఎన్టీఆర్- ప‌వ‌న్ లాంటి స్టార్ల సినిమాల‌కు సంగీతం అందిస్తున్న అత‌డు బాల‌య్య అఖండ‌కు సంగీతం అందిస్తున్నారు. త‌దుప‌రి గోపిచంద్ సినిమాకి ప‌ని చేస్తుండ‌డం ఆస‌క్తిని క‌లిగిస్తోంది.

మ‌రోవైపు బాల‌య్య కోసం గోపిచంద్ మ‌లినేని ఏకంగా సీనియ‌ర్ హీరోయిన్ త్రిష‌ను బ‌రిలో దించుతుండడం వేడెక్కిస్తోంది. త్రిష కొంత‌కాలంగా గౌత‌మ్ మీన‌న్ తో సినిమా కోసం వేచి చూస్తోంది. అలాగే ప‌లు వెబ్ సిరీస్ ల‌లోనూ న‌టించేందుకు స‌న్నాహ‌కాల్లో ఉంద‌ని ప్ర‌చార‌మైంది. ఇప్పుడు ఎన్బీకే చిత్రానికి క‌మిటైంది. మైత్రి మూవీ మేకర్స్ ఈ సినిమాని నిర్మిస్తోంది. మ‌రోవైపు బాల‌య్య అఖండ 20రోజుల పెండింగ్ చిత్రీక‌ర‌ణ‌ను ముగించి పూర్తిగా గోపిచంద్ మ‌లినేని మూవీకి అందుబాటులోకి వస్తారు. వ‌చ్చే నెల 10న బాల‌య్య బ‌ర్త్ డే సంద‌ర్భంగా ఈ మూవీనుంచి అప్ డేట్ ని వెల్ల‌డిస్తార‌ని స‌మాచారం.