Begin typing your search above and press return to search.

NBK అన్ స్టాప‌బుల్ .. త‌గ్గేదేలే!

By:  Tupaki Desk   |   25 Dec 2021 5:48 AM GMT
NBK అన్ స్టాప‌బుల్ .. త‌గ్గేదేలే!
X
నంద‌మూరి న‌ట‌సింహం బాల‌కృష్ణ ఒక ఓటీటీ షో చేస్తార‌ని దానిని అజేయంగా న‌డిపిస్తార‌ని అభిమానులు ఏనాడూ ఊహించ‌లేదు. కానీ ఊహించ‌నిది చేసి చూపించ‌డ‌మే త‌న స్టైల్ అని నిరూపిస్తూ ఎన్బీకే ఓటీటీ వేదిక‌పై రికార్డులు బ్రేక్ చేస్తున్నారు. సామ్ జామ్ తో స‌మంత ఎంత పెద్ద స‌క్సెసైందో అంత‌కుమించి గొప్ప స‌క్సెస్ ని ఆహా-తెలుగు ఓటీటీకి అందించ‌డంలో హోస్ట్ గా బాల‌కృష్ణ పెద్ద స‌క్సెస‌య్యారు.

సెల‌బ్రిటీ ఇంట‌ర్వ్యూల‌ను త‌న‌దైన శైలిలో అద‌ర‌గొట్టేస్తున్నారు ఎన్.బి.కే. ఆహాకి ఈ కార్య‌క్ర‌మం ఎంతో ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలుస్తోంది. తాజాగా న‌ట‌సింహా బాల‌కృష్ణ తో పుష్ప టీమ్ స్పెష‌ల్ ఎపిసోడ్ టెలీకాస్ట్ కానుంది. దీనికి సంబంధించిన ప్రోమోని లేటెస్టుగా ఆహా వ‌ర్గాలు రిలీజ్ చేశాయి.

పుష్ప అంటే ఫ్ల‌వ‌ర్ అనుకుంటివా.. ఫైర్.. త‌గ్గేదేలే..! అన్న డైలాగ్ తో ఈ ప్రోమో ఎంతో ఆక‌ట్టుకుంది. ఏ బిడ్డా ఇది నా అడ్డా..! నేప‌థ్య సంగీతం.. ఇక పుష్ప‌రాజ్ ఆహార్యంతో బాల‌య్య బాబు పండించిన ఆహార్యం ఎంతో స్పెష‌ల్ గా క‌నిపించాయి.

బాల‌కృష్ణ‌- బ‌న్ని- ర‌ష్మిక - సుకుమార్ బృందం వేదిక‌పై న‌డిచొస్తూ ఎంతో ఫ‌న్ క్రియేట్ చేసారు. ఇక బాల‌య్య‌- బ‌న్ని మ‌ధ్య కెమిస్ట్రీ కూడా అంతే గొప్ప‌గా కుదిరింది. ఒక చిన్న గ్లింప్స్ తోనే ఇంతటి మ్యాజిక్ చేసారు. పూర్తి ఎపిసోడ్ ఇంకే రేంజులో అల‌రించ‌నుందో వేచి చూడాలి. ఆస‌క్తిక‌రంగా ఈ ప్రోమోని మాన్స‌న్ హౌస్ ఒరిజిన‌ల్.. తెనాలి డ‌బుల్ హార్స్ వంటి బ్రాండ్ల‌తో ప్ర‌మోట్ చేయ‌డం ఇంట్రెస్టింగ్. #UnstoppableMeetsThaggedheLe అనే హ్యాష్ ట్యాగ్ తో వైర‌ల్ అవుతోంది.