Begin typing your search above and press return to search.

NBK టాక్ షో కొత్త OTT రికార్డు

By:  Tupaki Desk   |   30 Nov 2021 10:31 AM GMT
NBK టాక్ షో కొత్త OTT రికార్డు
X
న‌ట‌సింహా నందమూరి బాలకృష్ణ ఇటీవ‌ల ఓటీటీ టాక్ షోతో అద‌ర‌గొట్టేస్తున్న సంగ‌తి తెలిసిదే. తొలి సెలబ్రిటీ టాక్ షో ఆహాపై `అన్ స్టాపబుల్ విత్ NBK` OTT ప్లాట్ ఫామ్ లో 4 మిలియన్లకు పైగా లైక్ ల‌తో రికార్డ్ సృష్టించింది. బాలకృష్ణ టాక్ షో అన్ స్టాపబుల్ విత్ ఎన్‌.బి.కె 4 మిలియన్లకు పైగా వీడియో ప్లేతో చార్ట్ లో టాప్ లోకి వెళ్లిందని ఆహా వీడియో నుండి అధికారిక ప్రకటన వెలువ‌డింది.

తెలుగు OTT స్పేస్ లో ఏ టాక్ షోకి అయినా అత్యధిక వ్యూస్ సాధించిన షోగా పాపుల‌రైంది. టాక్ షో కర్టెన్ రైజర్ ఎపిసోడ్ కు మంచు మోహన్ బాబు అతిథిగా వచ్చారు. ఆయనతో పాటు మంచు విష్ణు - మంచు లక్ష్మి ప్రసన్న పాల్గొన్నారు. సెకండ్ ఎపిసోడ్ లో బాలకృష్ణతో మాట్లాడేందుకు నాని కనిపించాడు. రెండు ఎపిసోడ్ లు OTT ప్రేక్షకులను బాగా ఆకట్టుకున్నాయి. మునుముందు ఆహాలో ఈ షో మ‌రింత రంజింప‌జేయ‌నుంది.

మ‌రోవైపు నంద‌మూరి బాల‌కృష్ణ వ‌రుస చిత్రాల‌తో కెరీర్ ప‌రంగా బిజీగా ఉన్నారు. బాల‌కృష్ణ హీరోగా బోయ‌పాటి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన అఖండ డిసెంబ‌ర్ లో విడుద‌ల‌వుతోంది. త‌దుప‌రి గోపిచంద్ మ‌లినేని ద‌ర్శ‌క‌త్వంలో ఆయ‌న న‌టించ‌నున్నారు. పూరి జ‌గ‌న్నాథ్.. అనీల్ రావిపూడితోనూ ఓ సినిమా చేయాల్సి ఉంది. నంద‌మూరి మోక్ష‌జ్ఞ డెబ్యూ సినిమా ఆదిత్య 999 మ్యాక్స్ ని వ‌చ్చే ఏడాది ప్రారంభిస్తామ‌ని బాల‌కృష్ణ తెలిపారు.