Begin typing your search above and press return to search.

న‌ట‌సింహం NBKతో అల్లు బాస్ కాప్ డ్రామా!

By:  Tupaki Desk   |   23 Jan 2022 8:30 AM GMT
న‌ట‌సింహం NBKతో అల్లు బాస్ కాప్ డ్రామా!
X
అల్లు అరవింద్ తో బాలకృష్ణ కాప్ చిత్రం చేయ‌బోతున్నారా? అంటే అవున‌నే స‌మాచారం. ఇటీవ‌లి కాలంలో ఆహాతో ముడిప‌డిన బంధం ఇప్పుడు పెనుబంధంగా మారింది. నిను వీడ‌ని నీడ‌ను నేను! అంటూ అల్లు బాస్ బాల‌య్య బాబును విడిచిపెట్టేట్టు లేరు. నందమూరి బాలకృష్ణపై బాస్ అర‌వింద్ ప్రేమను కురిపించ‌డం ఆఫ‌ర్లు ఇవ్వ‌డం హాట్ టాపిక్ గా మారుతోంది.

నిజానికి గీతా ఆర్ట్స్ అంటే మెగాస్టార్ చిరంజీవికి హోమ్ బ్యాన‌ర్. ఈ సంస్థ‌లో ఆయ‌న వ‌రుస సినిమాలు చేయాల్సి ఉంది. కానీ ఇప్పుడు న‌ట‌సింహా నంద‌మూరి బాల‌కృష్ణ వైపు అర‌వింద్ చూస్తుండ‌డం గుస‌గుస‌లకు తావిస్తోంది. మెగాస్టార్ చిరంజీవి సెకండ్ ఇన్నింగ్స్ లో చాలా బిజీగా ఉండ‌గా సొంత బ్యాన‌ర్ కొణిదెల ప్రొడ‌క్ష‌న్స్ లోనే వ‌రుస చిత్రాలు చేస్తున్నారు. ఇంత‌కుముందు అర‌వింద్ బ్యాన‌ర్ లో సినిమా చేస్తాన‌ని మాటిచ్చినా అది వీలు ప‌డ‌లేదు. దీంతో అర‌వింద్ మ‌రో అగ్ర హీరో బాల‌కృష్ణ‌తో సినిమాలు టీవీ షోలు చేసేందుకు ఒప్పందాలు చేసుకుంటున్నారు.

ఆహాలో బాలకృష్ణ హోస్ట్ గా `అన్ స్టాపబుల్‌` ఎంత పెద్ద స‌క్సెసైందో తెలిసిన‌దే. ఇప్పుడు సినిమా చేయడానికి ప్లాన్ చేస్తున్నారు. ఇక బాల‌య్య బాబుతో బన్నీ స్నేహం ఆప్యాయ‌త కూడా ఇటీవ‌ల ట్రెండింగ్ గా మారుతోంది. ఆ ఇద్ద‌రి అనుబంధం నేప‌థ్యంలో అల్లు కాంపౌండ్ లో ఎన్.బి.కే సినిమాకి దారులు సులువ‌య్యాయ‌ని గుస‌గుస వినిపిస్తోంది. ఇక ఎన్బీకేతో కాప్ డ్రామాను తెర‌కెక్కించేందుకు నందమూరి కళ్యాణ్ రామ్ తో సినిమా తీసిన మల్లిడి సత్యనారాయణరెడ్డి తనయుడు యువ దర్శకుడు మల్లిడి వశిష్ట్ కి ఇప్పటికే రూ.5 లక్షలు అడ్వాన్స్ గా చెల్లించారని తెలిసింది. ఒక అద్భుత‌మైన లైన్ తో కాప్ డ్రామాను తెర‌కెక్కించనున్నార‌ని తెలిసింది. గీతా ఆర్ట్స్ బ్యానర్ ఇప్ప‌టికే ఇత‌ర హీరోల‌తోనూ సినిమాలు చేసేందుకు సిద్ధంగా ఉంది.

సూప‌ర్ స్టార్ మహేష్ బాబుతో సినిమా చేయాలని చాలా కాలంగా అర‌వింద్ ప్లాన్ చేస్తున్నారు కానీ కుద‌ర‌డం లేదు. బాల‌య్య‌ను మాత్రం లాక్ చేయ‌డం ఖాయంగా క‌నిపిస్తోంద‌ని గుస‌గుస వినిపిస్తోంది. ప్ర‌స్తుతం ఈ రిలేష‌న్ షిప్ పై ఆస‌క్తి నెల‌కొంది. ఈ ప్రాజెక్ట్ ను అధికారికంగా ప్ర‌క‌టించాకే క‌న్ఫామ్ చేయాల్సి ఉంటుంది.