Begin typing your search above and press return to search.

ఎన్‌ బి కే గా బాలయ్య 'ఎఫ్‌3'

By:  Tupaki Desk   |   9 Nov 2021 12:30 PM GMT
ఎన్‌ బి కే గా బాలయ్య ఎఫ్‌3
X
నందమూరి బాలకృష్ణ.. అనీల్ రావిపూడి కాంబోలో మూవీ కన్ఫర్మ్‌ అయ్యింది. అఖండ సినిమా విడుదల అవ్వగానే గోపీచంద్‌ మలినేని దర్శకత్వంలో ఒక సినిమాను చేయబోతున్న బాలయ్య ఆ తర్వాత అనీల్ రావిపూడి దర్శకత్వంలో సినిమా చేసేందుకు ఇప్పటికే కమిట్ అయ్యాడు. వీరిద్దరి కాంబోలో రామారావు గారు అనే టైటిల్ తో సినిమా రావాల్సి ఉంది. కాని సినిమా ఆలస్యం అవ్వడంతో ఈలోపు రామారావు టైటిల్‌ ను రవితేజ దక్కించుకున్నాడు. రామారావు ఆన్ డ్యూటీ అంటూ రవితేజ సినిమాను చేస్తున్నాడు. దాంతో బాలయ్య కోసం అనీల్ రావిపూడి మరో కొత్త టైటిల్ ను అనుకుంటున్నాడట. ఇండస్ట్రీ వర్గాల ద్వారా అందుతున్న సమాచారం ప్రకారం బాలయ్య కోసం ఎన్‌ బీ కే అనే టైటిల్ ను అనీల్ రావిపూడి పరిశీలిస్తున్నాడని.. బాలయ్య కూడా అందుకు సుముఖత వ్యక్తం చేసే అవకాశాలు ఉన్నాయని అంటున్నారు.

అనీల్‌ రావిపూడి ప్రస్తుతం ఎఫ్‌ 3 సినిమాను తెరకెక్కిస్తున్నాడు. ఈనెల చివరి వరకు ఎఫ్ 3 ని ముగించే అవకాశాలు ఉన్నాయంటున్నారు. వెంకటేష్‌ మరియు వరుణ్ తేజ్‌ లు హీరోలుగా మెహ్రీన్ మరియు తమన్నాలు హీరోయిన్స్ గా ఈ సినిమాలో నటిస్తున్నారు. సునీల్‌.. రాజేంద్ర ప్రసాద్‌ లు కీలక పాత్రలో కనిపించబోతున్నారు. ఎఫ్‌ 2 మంచి విజయాన్ని సొంతం చేసుకోవడం.. ఆ తర్వాత ఆయన దర్శకత్వంలో వచ్చిన సరిలేరు నీకెవ్వరు మంచి విజయాన్ని సొంతం చేసుకోవడంతో ఎఫ్‌ 3 పై సహజంగానే అంచనాలు భారీగా ఉన్నాయి. ఎఫ్‌ 3 తో మరో సక్సెస్ ను దక్కించుకుంటే ఖచ్చితంగా బాలయ్య సినిమా కు పాజిటివ్‌ బజ్ క్రియేట్‌ అయ్యే అవకాశం ఉందని అంటున్నారు. మొత్తానికి బాలయ్య తో ఎఫ్‌ 3 వంటి ఒక మంచి మాస్ ఎంటర్‌ టైనర్‌ ను తెరకెక్కించే యోచనలో దర్శకుడు ఎన్నాడనే వార్తలు వస్తున్నాయి.

ఇక ఈ సినిమాలో బాలయ్యను మూడు విభిన్నమైన పాత్రల్లో చూపించబోతున్నట్లుగా తెలుస్తోంది. బాలకృష్ణ పోషిస్తున్న మూడు పాత్రలకు సంబంధించినవే ఎన్‌ బి కే అక్షరాలు అనే టాక్ కూడా వినిపిస్తుంది. వచ్చే ఏడాది మార్చిలో వీరి కాంబో సినిమా పట్టాలెక్కించేలా ప్రయత్నాలు జరుగుతున్నాయట. బాలయ్య డబుల్ రోల్‌ చేస్తేనే అభిమానులకు పూనకాలు. అదే ట్రిపుల్ రోల్ చేస్తే అంచనాలు ఏ రేంజ్ లో ఉంటాయో అర్థం చేసుకోవచ్చు. ఎన్‌ బి కే సినిమా చిత్రీకరణ వచ్చే ఏడాదిలోనే ప్రారంభించి వచ్చే ఏడాది చివరి వరకు సినిమాను విడుదల చేసేలా ప్లాన్ చేస్తారట. అతి త్వరలోనే బాలయ్య ఎఫ్‌ 3 కాంబో సినిమాపై మరింత క్లారిటీ వచ్చే అవకాశాలు ఉన్నాయి.