Begin typing your search above and press return to search.

NBK -అనీల్ రావిపూడి బ‌డ్జెట్ షాకిస్తోందే!

By:  Tupaki Desk   |   7 Dec 2021 7:00 AM IST
NBK -అనీల్ రావిపూడి బ‌డ్జెట్ షాకిస్తోందే!
X
న‌ట‌సింహా నందమూరి బాల‌కృష్ణ `అఖండ‌` చిత్రంతో  మ‌రో భారీ హిట్ అందుకుని రెట్టించిన ఉత్సాహంలో ఉన్నారు. `సింహ‌`..`లెజెండ్` త‌ర్వాత `అఖండ` తో హ్యాట్రిక్ హిట్ కొట్టి చూపించారు. బాల‌య్య బ్రాండ్ ఇమేజ్ మ‌రింత మెరుగుప‌డింది. కొత్త క‌మిట్ మెంట్లు జోరందుకున్నాయి. త్వ‌ర‌లోనే గోపీచంద్ మ‌లినేని తో 107వ చిత్రం రెగ్యుల‌ర్  షూటింగ్ ప్రారంభించ‌నున్నారు. ఇప్ప‌టికే సినిమా లాంచింగ్ కూడా పూర్త‌యింది. ఇది బాల‌య్య మాస్ ఇమేజ్ కి ఏ మాత్రం త‌గ్గ‌కుండా ప‌క్కా మాస్ మ‌సాలా ఎంట‌ర్ టైన‌ర్ అని తెలుస్తోంది. ఈ సినిమా త‌ర్వాత మ‌రికొంత మంది ద‌ర్శ‌కులు లైన‌ప్ లో ఉన్నారు. అయితే ఎంద‌రు వెయింటింగ్ లో ఉన్నా బాల‌య్య మాత్రం యంగ్ ట్యాలెంటెడ్ డైరెక్ట‌ర్ అనీల్ రావిపూడితో సినిమా చేయ‌డానికి ఎక్కువ‌గా ఆస‌క్తి చూపిస్తున్నారు.

బాల‌య్య  ఎన‌ర్జీని మ్యాచ్ చేసే స్క్రిప్ట్ తో  లాక్  చేసిన నేప‌థ్యంలో రావిపూడితోనే ముందుకు వెళ్లాల‌ని  ప్లాన్ చేస్తున్నారు.  వాస్త‌వానికి బాల‌య్య 100వ  చిత్రానికి అనీల్ రావిపూడి ద‌ర్శ‌క‌త్వం వ‌హించాల్సి ఉన్నా కుద‌ర‌లేదు. అప్పటి ప‌రిస్థితులు కార‌ణంగా..బాల‌య్య కి ల్యాండ్ మార్క్ మూవీ కావ‌డంతో ఆ అవ‌కాశం క్రిష్  కి ఇవ్వాల్సి వ‌చ్చింది. అయితే ఇప్పుడు  బాల‌య్య 108 మాత్రం అనీల్ తో దాదాపు ఫిక్స్ అయ్యింద‌ని తెలుస్తోంది. ఈ చిత్రాన్ని  60 కోట్ల బ‌డ్జెట్ తో నిర్మించ‌నున్న‌ట్లు స‌మాచారం. సాహో గార‌పాటి.. హ‌రీష్ పెద్ది  నిర్మిస్తున్నారు. `అఖండ` వ‌సూళ్ల ధీమాతోనే నిర్మాత‌లు బాల‌య్య పై అంత ఖ‌ర్చు చేయ‌డానికి రెడీ అవుతున్నార‌ట‌.

మొత్తానికి వ‌య‌సు మీద ప‌డుతున్నా బాల‌య్య రేంజు మాత్రం పెరుగుతోందే కానీ త‌గ్గ‌డం లేదు. బ‌డ్జెట్లు మాములుగా లేవు.`ఆహా 2.0`కి హోస్ట్ గాను వ్య‌వ‌హ‌రించ‌డంతో బాల‌య్య క్రేజ్ మ‌రింత పెరిగింది. ఇదే స‌మ‌యంలో `అఖండ‌` హిట్ ఆ క్రేజ్ ని రెట్టింపు చేసింది. మొత్తానికి బాల‌య్య భ‌విష్య‌త్ లో ఎన్టీఆర్-మ‌హేష్ లాంటి యువ‌హీరోల‌కు కూడా గ‌ట్టి పోటీ ఇవ్వ‌డం ఖాయ‌మే అనిపిస్తోంది. సీనియ‌ర్ ద‌ర్శ‌కులు సింగీతం శ్రీనివాస‌రావుతో  ప్ర‌యోగాల‌కు రెడీ అంటోన్న సంగ‌తి తెలిసిందే. మోక్ష‌జ్ఞ‌తో క‌లిసి ఆదిత్య 369 సీక్వెల్లోనూ బాల‌య్య న‌టిస్తారు.