Begin typing your search above and press return to search.

NBK `అఖండ‌` OTT డీల్ ఆ రేంజులో..!

By:  Tupaki Desk   |   18 April 2021 4:30 AM GMT
NBK `అఖండ‌` OTT డీల్ ఆ రేంజులో..!
X
NBK న‌టిస్తున్న తాజా చిత్రం అఖండ‌. సింహా - లెజెండ్ త‌ర్వాత హ్యాట్రిక్ హిట్ కొట్ట‌డ‌మే ధ్యేయంగా బోయ‌పాటి చేస్తున్న త‌ప‌స్సు గురించి తెలిసిన‌దే. ఇప్ప‌టికే రిలీజ్ చేసిన ఫ‌స్ట్ లుక్ పోస్ట‌ర్లు టీజ‌ర్లు ఆక‌ట్టుకున్నాయి. ఇది సినిమా బిజినెస్ కి ప్ల‌స్ అవుతోంది.

తాజా స‌మాచారం మేర‌కు ఓటీటీ డీల్ స‌హా శాటిలైట్ డీల్ కూడా పూర్త‌యింద‌ని తెలుస్తోంది. మాటీవీ శాటిలైట్ హ‌క్కుల్ని ద‌క్కించుకోగా.. హాట్ స్టార్ ఓటీటీ హ‌క్కుల్ని చేజిక్కించుకుంది.

రెండు బ్లాక్ బ‌స్ట‌ర్లు అందుకున్న కాంబినేష‌న్ కాబ‌ట్టి అఖండ‌కు పెద్ద డీల్స్ సెట్ట‌య్యాయ‌ని గుస‌గుస‌లు వినిపిస్తున్నాయి. వాణిజ్య వర్గాల ప్రకారం బాలకృష్ణ `అఖండ`తో తన కెరీర్ బెస్ట్ ఒప్పందాలను ద‌క్కించుకున్నారు. బాల‌య్య వేరే ద‌ర్శ‌కుల‌తో క‌లిసి ప‌ని చేయ‌డం వేరు. బోయ‌పాటితో క‌లిసి ప‌ని చేయ‌డం వేరు అని ట్రేడ్ భావిస్తోంద‌ని అందుకే భారీ మొత్తాల్ని ముట్టజెబుతోందని కూడా టాక్ వినిపిస్తోంది.

చేతిలో త్రిశూలం మెడ‌లో రుద్రాక్ష‌ల‌తో బాల‌య్య బాబు అఘోరా గెట‌ప్ సంచ‌ల‌నాలు సృష్టించిన సంగ‌తి తెలిసిందే. ఈ పాత్ర‌లో అత‌డి ఆహార్యం పీక్స్ అని తాజా టీజ‌ర్ చెబుతోంది. అందుకే డీల్స్ లో హైప్ పెరిగింద‌ట‌. ఈ చిత్రంలో ప్ర‌గ్య జైశ్వాల్ క‌థానాయిక. 28 మే రిలీజ్ కావాల్సిన ఈ చిత్రం మ‌హ‌మ్మారీ వ‌ల్ల ఆల‌స్య‌మవుతుంద‌ని క‌థ‌నాలొస్తున్నాయి. అయితే చిత్ర‌బృందం అధికారికంగా ధృవీక‌రించాల్సి ఉంటుంది.