Begin typing your search above and press return to search.

కొండారెడ్డి బురుజు దగ్గర మాస్ జాతర.. 'వీర సింహారెడ్డి'నే ఫిక్స్ చేశారా..?

By:  Tupaki Desk   |   21 Oct 2022 5:40 AM GMT
కొండారెడ్డి బురుజు దగ్గర మాస్ జాతర.. వీర సింహారెడ్డినే ఫిక్స్ చేశారా..?
X
'అఖండ' తో సక్సెస్ ట్రాక్ ఎక్కినా నటసింహ నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం మాస్ డైరెక్టర్ గోపీచంద్ మలినేని దర్శకత్వంలో ఓ మాస్ యాక్షన్ ఎంటర్టైనర్ లో నటిస్తున్న సంగతి తెలిసిందే. మైత్రీ మూవీ మేకర్స్ బ్యానర్ లో #NBK107 అనే వర్కింగ్ టైటిల్ తో ఈ సినిమా షూటింగ్ జరుపుకుంటోంది. .

ఇప్పటికే ఈ సినిమా నుంచి వచ్చిన బాలకృష్ణ ఫస్ట్ లుక్ - ఇతర స్పెషల్ పోస్టర్స్ మరియు ఫస్ట్ హంట్ టీజర్ నందమూరి అభిమానులను విశేషంగా ఆకట్టుకున్నాయి. అయితే ఇప్పుడు ఈ మూవీకి సంబంధించిన టైటిల్ ను లాంచ్ చేయడానికి మేకర్స్ రెడీ అయ్యారు.

#NBK107 టైటిల్‌ ను కర్నూలులోని ఐకానిక్ కొండారెడ్డి బురుజు దగ్గర లాంచ్ చేయనున్నట్లు ఇది వరకే ప్రకటించారు. ఈరోజు శుక్రవారం (అక్టోబర్ 21) రాత్రి 8.15 నిమిషాలకు జరగనున్న వేడుకలో ఈ సినిమా టైటిల్ ను వెల్లడించనున్నట్లు పేర్కొన్నారు.

ఈ నేపథ్యంలో గాడ్ ఆఫ్ మాసెస్ కు దారి ఇవ్వండి అంటూ చిత్ర బృందం ఓ స్పెషల్ వీడియోని సోషల్ మీడియాలో షేర్ చేసింది. 'నరకడం మొదలుపెడితే.. ఏ పార్ట్ ఏదో మీ పెళ్లాలకు కూడా తెలియదు నా కొడకల్లారా..' అంటూ టీజర్ లో బాలయ్య చెప్పిన పవర్ ఫుల్ డైలాగ్ తో ఈ గ్లిమ్స్ ని కట్ చేసారు.

కొండారెడ్డి బురుజు వద్ద టైటిల్ ను ఆవిష్కరించడం తెలుగు చిత్ర పరిశ్రమలో తొలిసారి అని పేర్కొన్నారు. ఇకపోతే NBK107 సినిమాకు టైటిల్ ఇదేనంటూ నెట్టింట కొన్ని పేర్లు వైరల్ అవుతున్నాయి. 'వీర సింహా రెడ్డి' 'రెడ్డిగారు' 'అన్నగారు' వంటి టైటిల్స్ ఎక్కువగా ప్రచారంలో ఉన్నాయి.

'వీర సింహారెడ్డి' టైటిల్ కే బాలయ్య అండ్ టీమ్ మొగ్గు చూపారని.. టైటిల్ ఫాంట్ కూడా చాలా బాగుందని ఇన్సైడ్ టాక్ వినిపిస్తోంది. ఇందులో నిజమెంతనేది తెలియాలంటే.. కొండారెడ్డి బురుజు సాక్షిగా ప్రకటించే టైటిల్ కోసం వేచి చూడాల్సిందే.

బాలకృష్ణ 107వ సినిమాలో నటసింహం రెండు గెటప్స్ లో కనిపించనున్నట్లు తెలుస్తోంది. ఇందులో శృతిహాసన్ హీరోయిన్ గా నటిస్తోంది. కన్నడ యాక్టర్ దునియా విజయ్ విలన్ రోల్ లో నటిస్తుండగా.. వరలక్ష్మీ శరత్ కుమార్ కీలక పాత్ర పోషిస్తోంది. చంద్రిక రవి స్పెషల్ సాంగ్ లో ఆడిపాడనుంది.

నవీన్ యెర్నేని - వై రవిశంకర్ ఈ చిత్రాన్ని భారీ ఎత్తున నిర్మిస్తున్నారు. ఎస్ థమన్ సంగీతం సమకూర్చగా.. సాయి మాధవ్ బుర్రా డైలాగ్స్ అందించారు. రిషి పంజాబీ సినిమాటోగ్రఫీ.. ఎఎస్ ప్రకాష్ ప్రొడక్షన్ డిజైనింగ్.. నవీన్ నూలి ఎడిటింగ్ విభాగాలు నిర్వహించారు.

'అఖండ' విడులైన రోజునే అంటే, డిసెంబర్ 2న ఈ చిత్రాన్ని రిలీజ్ చేసే అవకాశాలు ఉన్నాయని వార్తలు వస్తున్నాయి. ఒకవేళ ఈ డేట్ కి రాకపోతే సంక్రాంతి బరిలో దిగే అవకాశం ఉందని అంటున్నారు. ఈరోజు టైటిల్ లాంచ్ తో మేకర్స్ రిలీజ్ డేట్ పై కూడా క్లారిటీ ఇస్తారేమో చూడాలి.


నోట్ : మీ ఫీడ్ బ్యాక్ మాకు ముఖ్యం. క్రింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. మా కంటెంట్ నచ్చినా చెప్పండి. నచ్చకపోయినా చెప్పండి. హుందాగా స్పందించండి. abuse వద్దు.