Begin typing your search above and press return to search.

#NBK107 బాసూ ఈ అవ‌తారం ఏంటీ?

By:  Tupaki Desk   |   20 July 2022 5:29 PM GMT
#NBK107 బాసూ ఈ అవ‌తారం ఏంటీ?
X
బాసూ ఈ మాస్ అవ‌తారం ఏంటీ..? బాప్ రే.. అవ‌తార్ కైనా మ‌తిచెడేలా!! అంటూ కామెంట్లు చేస్తున్నారు నెటిజ‌నులు. తాజాగా న‌ట‌సింహా నంద‌మూరి బాల‌కృష్ణ‌ లీక్డ్ ఫోటో ఒక‌టి అంత‌ర్జాలంలో విడుద‌ల కాగా.. ఆయ‌న‌లోని మాసిజానికి ఫ్యాన్స్ ఫిదా అయిపోతున్నారు.

ఇది గోపీచంద్ మలినేని తెర‌కెక్కిస్తున్న‌ #NBK107 సెట్స్ నుంచి లీక్డ్ ఫోటో. ప్ర‌స్తుతం ఏపీలోని కర్నూలు జిల్లాలో మూవీ చిత్రీక‌ర‌ణ సాగుతోంది. కొన్ని ముఖ్యమైన మాస్ సన్నివేశాలను అక్కడ చిత్రీకరిస్తున్నారు. ఇంతలోనే ఆన్ లొకేషన్ నుంచి కొన్ని ఫోటోలు లీక‌య్యాయి. సామాజిక మాధ్య‌మాల్లో ఈ ఫోటోలు దుమారం రేపుతున్నాయి.

బాలకృష్ణ లుక్ సంథింగ్ స్పెష‌ల్ గా క‌నిపిస్తోంది. ఆయ‌న‌ వైట్ అండ్ వైట్ లుక్ లో ఉన్నా ష‌ర్ట్ లెస్ గా పూర్తి మాసీగా క‌నిపిస్తున్నారు. చొక్కా కాల‌ర్ ని అలా భుజాల మీదుగా వదిలేసి కాలిపై కాలు వేసుకుని ఒక స్పెష‌ల్ యాటిట్యూడ్ తో క‌నిపించాడు. ఆయ‌న ఆ స‌మ‌యంలో భోజ‌నం చేస్తున్నాడు. కానీ ఎలాంటి భేష‌జం లేకుండా భిన్నంగా సింపుల్ గా చెట్టు నీడ‌న కానిచ్చేస్తున్నారు. బాల‌య్య అభిమానులు ఈ లుక్ కి మురిసిపోతున్నారు. బాసూ ఇస్టైలూ ఆ మాస్ గెటప్పూ అదిరెనులే.. మాస్ కా బాప్ అంటూ కితాబిచ్చేస్తున్నారు. #NBK107 డిసెంబర్ లో విడుదల కానుంది.

ఇంత‌కీ నెక్స్ట్ ఏంటీ?

బాల‌కృష్ణ ఇటీవ‌ల కెరీర్ ప‌రంగా స్పీడ్ పెంచిన సంగ‌తి తెలిసిందే. బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేస్తున్నారు. త‌దుప‌రి అనీల్ రావిపూడితో సినిమాకి సన్నాహ‌కాల్లో ఉన్నారు. ఇటీవ‌ల నట‌సింహా నంద‌మూరి బాల‌కృష్ణ అనీల్ రావిపూడితో త‌న సినిమాకి మంచి టైటిల్ కోసం వేచి చూస్తున్నారు. కానీ కుద‌ర‌డం ఏదు. అనీల్ రావిపూడి టైటిల్ కోసం వెతుకుతున్నారని టాక్ వినిపించింది. ఇంత‌కుముందు `రామారావు గారు!` అనే టైటిల్ ని రావిపూడి సూచిస్తే అదే టైటిల్ తో ర‌వితేజ సినిమా చేస్తున్నందున వ‌ద్దనుకున్నార‌ట‌.

ఆ త‌ర్వాత `బ్రో! ఐ డోంట్ కేర్` అనే టైటిల్ ని సూచించ‌గా.. బాల‌య్యకు ఇది న‌చ్చ‌లేద‌ట‌. మ‌రో టైటిల్ ని వెత‌క‌మ‌ని కూడా ద‌ర్శ‌కుడికి సూచించిన‌ట్టు తెలుస్తోంది. గోపిచంద్ మ‌లినేనితో కెరీర్ 107వ సినిమా చేస్తున్న బాల‌కృష్ణ త‌దుప‌రి అనీల్ రావిపూడితో ఎన్.బి.కె 108 మూవీ చేయ‌నున్నారు. ప్ర‌స్తుతం 108 సినిమాకి టైటిల్ డైల‌మా కొన‌సాగుతోంది. ట్యాలెంటెడ్ అనీల్ రావిపూడి ఏదో ఒక‌టి ఫైన‌ల్ చేయాల్సి ఉంటుంది.