Begin typing your search above and press return to search.

నజ్రియా నాని.. ఓకే కదా?

By:  Tupaki Desk   |   11 Jun 2022 11:30 AM GMT
నజ్రియా నాని.. ఓకే కదా?
X
నాచురల్ స్టార్ నాని ఎలాంటి సినిమా చేసినా కూడా అందులో విభిన్నమైన కథాంశం ఉండేలా ఎన్నో జాగ్రత్తలు తీసుకుంటాడు. అయితే కొన్నిసార్లు కథ వినే సమయంలో ఎంతో థ్రిల్లింగ్ గా ఫీల్ అయినప్పటికీ కూడా ఆ తర్వాత మేకింగ్ విషయానికి వచ్చేసరికి ఊహించని మార్పులు వస్తుంటాయి.

గత కొంత కాలంగా నాని నుంచి వస్తున్న సినిమాలలో అవే జరుగుతున్నాయి. చివరగా శ్యామ్ సింగరాయ్ అయితే అంతకు ముందు చేసిన సినిమాల్లో పెద్దగా ఆకట్టుకోలేదు.

ఇక ఇప్పుడు అంటే సుందరానికి సినిమా రిజల్ట్ ఎటు తేల్చుకోలేని పరిస్థితి ఏర్పడింది. ఈ సినిమా బాగానే వచ్చినప్పటికీ కూడా బాక్సాఫీస్ వద్ద కలెక్షన్స్ మాత్రం చాలా తక్కువగా ఉండటం ఆశ్చర్యాన్ని కలిగిస్తోంది. నాని సినిమా తెలుగులోనే ఇటీవల కాలంలో అతి తక్కువ ఓపెనింగ్స్ అందుకున్న సినిమాగా కూడా అంటే సుందరానికి నిలిచింది. ఇక ఈ సినిమాకు సంబంధించి ఒక ప్రత్యేకమైన ఫోటోను సోషల్ మీడియాలో షేర్ చేసుకున్న నాని 'మీరు చెప్పండి నాకు ఓకే కదా' అంటూ సినిమా గురించి అడిగాడు.

ఇక ఆ ఫ్రేమ్ లో నజ్రియా తో కలిసి సెల్ఫీ ఫోటో చాలా అందంగా తీసుకున్నావని నెటిజన్స్ పాజిటివ్ గా స్పందిస్తున్నారు. అయితే సినిమా విషయంలో మాత్రం ఓ వర్గం వారు మరి ఇంత క్లాస్ సినిమా అవసరం లేదని కూడా చెబుతున్నారు. మరి ఈ రేంజ్ లో అయితే సినిమాలు తీయక అని కూడా సలహాలు ఇస్తున్నారు. నాని నుంచి ఆడియన్స్ ఎక్కువగా కోరుకునేది కామెడీ సినిమాలనేని చాలాసార్లు రుజువైంది.

అయితే బలే బలే మగాడివోయ్ సినిమా తరహాలో మళ్లీ అలాంటి సినిమాలు చేయలేదు అని 'అంటే సుందరానికి' సినిమా అదే ఆలోచనతో చేసినట్లు నాని చెప్పాడు. అయితే ఇప్పుడు సినిమా రిజల్ట్ విషయంలో మాత్రం కాస్త కన్ఫ్యూజన్ నెలకొంది.

ఫస్ట్ డే బాక్సాఫీస్ వద్ద అయితే ఈ సినిమా పెద్దగా ఆకట్టుకోలేదు. ఇక శని ఆదివారాలు ఏ స్థాయిలో కలెక్షన్స్ అందుతాయి అనేది ప్రధానంగా మారింది. ఈ రెండు రోజులు నిలదొక్కుకుంటే సినిమా సోమవారం నాటికి ఫామ్ లోకి వస్తోంది. చూడాలి మరి ఏం జరుగుతుందో..