Begin typing your search above and press return to search.

నజ్రియాతో 'అంటే.. సుందరానికీ!' స్టార్ట్ చేసిన నాని..!

By:  Tupaki Desk   |   19 April 2021 5:38 AM GMT
నజ్రియాతో అంటే.. సుందరానికీ! స్టార్ట్ చేసిన నాని..!
X
నేచురల్ స్టార్ నాని నటిస్తున్న 28వ సినిమా ''అంటే.. సుందరానికీ!''. 'బ్రోచేవారేవరురా' 'మెంటల్‌ మదిలో' చిత్రాలతో దర్శకుడిగా మంచి గుర్తింపు తెచ్చుకున్న వివేక్‌ ఆత్రేయ ఈ చిత్రాన్ని తెరకెక్కిస్తున్నారు. 'రాజా రాణి' అనే డబ్బింగ్ సినిమాతో తెలుగు ప్రేక్షకులకు పలకరించిన మలయాళ బ్యూటీ నజ్రియా నజీమ్ ఫహాద్, ఈ చిత్రంతో టాలీవుడ్ లో అడుగుపెడుతోంది. మైత్రీ మూవీస్ మేకర్స్ బ్యానర్ పై నవీన్‌ యెర్నేని - యలమంచిలి రవిశంకర్‌ ఈ సినిమాని నిర్మిస్తున్నారు. టైటిల్ అనౌన్సమెంట్ పోస్టర్ తోనే ఈ సినిమాపై ఆసక్తిని కలిగించిన మేకర్స్.. ఈ ఏడాది సమ్మర్ లో షూటింగ్ మొదలు పెడతామని వెల్లడించారు. ఈ క్రమంలో తాజాగా 'అంటే.. సుందరానికీ!' షూటింగ్ స్టార్ట్ చేసినట్లు హీరోయిన్ నజ్రియా తెలిపారు.

నజ్రియా నజీమ్‌ తన ఇన్‌స్టాగ్రామ్‌ లో పోస్ట్ పెడుతూ.. "అందరికీ నమస్కారం.. ఈరోజు నా ఫస్ట్ తెలుగు సినిమా షూటింగ్‌ స్టార్ట్ చేశాను. ఫస్ట్ అనేది ఎప్పుడూ ఏదైనా స్పెషల్‌ గా ఉంటుంది. కాబట్టి 'అంటే సుందరానికీ' నాకు స్పెషల్‌" అని పేర్కొన్నారు. కాగా, లవ్‌ అండ్ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్‌ గా ఈ సినిమా రూపొందుతుంది. ఈ చిత్రానికి వివేక్ సాగ‌ర్ సంగీతం సమకూరుస్తున్నారు. నికేత్ బొమ్మి సినిమాటోగ్రాఫ‌ర్‌ గా వ్యవహరిస్తుండగా.. ర‌వితేజ గిరిజాల ఎడిట‌ర్‌ గా వర్క్ చేస్తున్నారు. ఈ చిత్రానికి ప‌నిచేసే మిగ‌తా తారాగ‌ణం, సాంకేతిక నిపుణుల వివ‌రాల‌ను త్వ‌ర‌లో వెల్ల‌డించ‌నున్నారు. ఇకపోతే ఇప్పటికే 'టక్‌ జగదీష్‌' సినిమాని విడుదలకు సిద్ధం చేసిన నాని.. 'శ్యామ్‌ సింగరాయ్‌' షూటింగ్ లో పాల్గొంటున్నాడు. ఇది పూర్తి కాకముందే తన నెక్ట్స్‌ మూవీ 'అంటే.. సుందరానికీ!' షూటింగ్‌ స్టార్ట్‌ చేసేశాడు.